మరోసారి జతకట్టనున్న క్రేజీ జంట.. విజయ్ దేవరకొండ నెక్స్ట్ హీరోయిన్ ఆమే!

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ అంటే ఎంత క్రేజ్ ఉందో చెప్పలేము.ఎందుకంటే ఆయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.

 Vijay Devarakonda And Rashmika To Pair Up Again-TeluguStop.com

తాను నటించిన ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ తో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్నాడు.అంతే కాకుండా ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తాడు.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.

 Vijay Devarakonda And Rashmika To Pair Up Again-మరోసారి జతకట్టనున్న క్రేజీ జంట.. విజయ్ దేవరకొండ నెక్స్ట్ హీరోయిన్ ఆమే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిన్న చిన్న పాత్రలతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ 2016 లో పెళ్లి చూపులు సినిమా లో హీరోగా పరిచయమయ్యారు.

ఆ సినిమాతోనే మంచి విజయం అందుకున్న తర్వాత ద్వారక సినిమాలో నటించగా అంత గుర్తింపు రాలేకపోయింది.ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అవగా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.ఇలా వరుస సినిమాల్లో నటించిన విజయ్ కు మంచి విజయాలే అందాయి.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తర్వాత నటించే సినిమాలో మరోసారి ఆ హీరోయిన్ తోనే జత కట్టనున్నాడట‌.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో విజయ్ బిజీగా ఉన్నాడు.ఇందులో బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉండగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు.

ఇదిలా ఉండగానే విజయ్ నెక్స్ట్ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పుష్ప సినిమాల్లో బిజీగా ఉన్న డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయనున్నాడు.

ఇదివరకే ఈ సినిమా కథలు విజయ్ కు వినిపించగా.కథ నచ్చడంతో ఓకే చెప్పాడట‌.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక చేయగా.ఇదివరకే విజయ్ తో రష్మిక మందన ను ఎంపిక చేశారట.

మొత్తానికి మరోసారి ఈ జంట తెరకెక్కనున్నారు.

#Rashmika #Pair Up Again

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు