క్యాలెండర్‌ మారింది మరి రౌడీ స్టార్‌ వచ్చేది ఎప్పుడు?

టాలీవుడ్ స్టార్‌ హీరోలు చాలా మంది కరోనా కారణంగా అయిదు ఆరు నెలలు ఖాళీగా ఉన్నారు.ఇంకా కొందరు కరోనా కారణంగా షూటింగ్ లు మొదలు పెట్టలేదు.

 Vijay Devarakonda And Poori Movie Not Started Yet, Poori Jagannath, Fighter Movi-TeluguStop.com

టాలీవుడ్ లో బాలకృష్ణ మరియు విజయ్‌ దేవరకొండలు మాత్రమే ఇంకా తమ సినిమాలను పునః ప్రారంభించలేదు.ఈ విషయంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ అంటే సీనియర్‌ హీరో ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.కాని విజయ్ దేవరకొండకు ఏం అయ్యింది.

ఎందుకు రౌడీ స్టార్‌ షూటింగ్‌ విషయంలో వెనక్కు తగ్గుతున్నాడు అంటూ అభిమానులు సైతం జుట్టు పీక్కుంటున్నారు.కొత్త ఏడాదిలో అయినా రౌడీ స్టార్‌ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.కాని ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్ ఇవ్వలేదు.

Telugu Anananya Pandy, Charmi, Fighter, Karan Johar, Poori Jaganadh, Vd-Movie

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్‌ అనే సినిమా దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయ్యింది.ఇప్పటి వరకు షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను విడుదల చేయాల్సి ఉంది.కాని పూరి మరియు రౌడీ ఇద్దరు కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉండి సినిమా విషయంలో ఎటూ తేల్చడం లేదు అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో గత మూడు నెలలుగా మెసేజ్‌ లు పెడుతూనే ఉన్నారు.

కాని వారి నుండి మాత్రం రెస్పాన్స్‌ రాలేదు.కొత్త ఏడాదిలో అయినా వారు షూటింగ్ కు హాజరు అవుతారేమో అని అంతా ఎదురు చూశారు. క్యాలెండర్‌ మారి వారం కావస్తుంది.అయినా కూడా అప్ డేట్‌ మాత్రం ఏమీ లేదు.

దాంతో అసలు ఏం జరుగుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తుండగా పూరితో కలిసి ఛార్మి మరియు కరణ్‌ జోహార్ లు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్ అనుకుంటున్నారు.ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube