వైరల్‌ : 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో దేవరకొండ ఉన్నాడా?

మహేష్‌ బాబు హీరోగా రూపొందిన మహర్షి చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.దాదాపు 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను ఈ చిత్రం రాబట్టినట్లుగా నిర్మాతలు ప్రకటించారు.

 Vijay Devarakonda And Mahesh Babu In Sarileru Neekevvaru Movie-TeluguStop.com

మహేష్‌బాబు 26వ చిత్రంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంను చేయబోతున్నాడు.ఇటీవలే కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రం లాంచనంగా ప్రారంభం అయ్యింది.

అనీల్‌ రావిపూడి ఈ చిత్రంకు దర్శకత్వం వహిస్తుండగా అనీల్‌ సుంకర మరియు దిల్‌రాజులు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 Vijay Devarakonda And Mahesh Babu In Sarileru Neekevvaru Movie-వైరల్‌ : సరిలేరు నీకెవ్వరు#8217; మూవీలో దేవరకొండ ఉన్నాడా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్‌ బాబు మహర్షి చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో విజయ్‌ దేవరకొండ పాల్గొన్న విషయం తెల్సిందే.గతంలో ఏ హీరోకు కూడా మహేష్‌ బాబు పెద్దగా ప్రియారిటీ ఇచ్చే వాడు కాదు.తన పనేదో తాను చూసుకునేవాడు.కాని విజయ్‌ దేవరకొండ విషయంలో మాత్రం కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టడం, తన సినిమా వేడుకకు పిలవడం జరిగింది.అంటే విజయ్‌ దేవరకొండపై మహేష్‌ బాబు ప్రత్యేకమైన అభిమానంను కనబర్చుతున్నట్లుగా చెప్పుకోవచ్చు.ఆ ఆసక్తితోనే మహేష్‌బాబు త్వరలో తాను నటించబోతున్న సరిలేరు నీకెవ్వరు మూవీలో చిన్న పాత్రను చేయించబోతున్నాడు అనేది పుకారు.

విజయ్‌ దేవరకొండ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తే సినిమా స్థాయి ఎక్కడికో వెళ్తుంది.మహేష్‌బాబుకు ఉన్న స్టార్‌ డంతో పాటు విజయ్‌ దేవరకొండ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూస్తే భారీ ఎత్తున సినిమాకు బిజినెస్‌ అయ్యే అవకాశం ఉందనేది నిర్మాతల ప్లాన్‌ అయ్యి ఉంటుంది.అందుకే విజయ్‌ దేవరకొండను చిన్న రోల్‌ చేయించేందుకు మహేష్‌ ఓకే చెప్పి ఉంటాడు.మొత్తానికి విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంలో నటిస్తున్నాడు అంటూ వస్తున్న పుకారు వైరల్‌ అయ్యింది.

ఈ వార్తలో నిజం ఎంత అనేది దర్శకుడు అనీల్‌ రావిపూడి క్లారిటీ ఇస్తే కాని తెలియదు.మరి ఆయన ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.విజయశాంతి ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా విజయ్‌ దేవరకొండ కూడా నటించే అవకాశం ఉందని కొందరు వింత లాజిక్‌ చెబుతున్నారు.మరి అది ఎంత వరకు నిజమో చూడాలి.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube