బ్యాగ్ లో కత్తి పెట్టుకొని తిరిగిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఏం జరిగిందంటే?

Vijay Devarakonda Actress Shivani Singh Put Knife In Her Bag For Self Protection

ఈ మధ్య సమాజంలో జరుగుతున్న నేరాలు అంతా ఇంతా కాదు.హత్యలు, అత్యాచారాలు బాగా జరుగుతున్న ఈ సమాజంలో బయటకు వెళ్ళాలన్న భయపడుతున్నారు జనాలు.

 Vijay Devarakonda Actress Shivani Singh Put Knife In Her Bag For Self Protection-TeluguStop.com

ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతోనే ఉంటున్నారు.ఎక్కడపడితే అక్కడ అత్యాచారాలు జరగటంతో పగటి వేళల్లో కూడా ఒంటరిగా వెళ్లలేకపోతున్నారు.

ఇప్పటికే సమాజంలో ఎన్నో లైంగిక దాడుల ఘటనలు జరిగాయి.ఎన్ని శిక్షలు విధించినా జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి.

 Vijay Devarakonda Actress Shivani Singh Put Knife In Her Bag For Self Protection-బ్యాగ్ లో కత్తి పెట్టుకొని తిరిగిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అమ్మాయిలు తమ రక్షణ కోసం తామే.తమ వెంట ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు.

స్ప్రే బాటిల్స్, కత్తులు వంటి పలు ఆయుధాలు తమ రక్షణగా తమ బ్యాగ్లో ఉంచుకుంటున్నారు.అలా ఓ హీరోయిన్ కు కూడా తన బ్యాగ్ లో కత్తి పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే.

విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శివాని సింగ్.

ఈమె కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు షోలలో హోస్టింగ్ చేసింది.అంతేకాకుండా మోడల్ గా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఈమె ఢిల్లీలో జన్మించగా ప్రస్తుతం ముంబైలో ఉంటుంది.ఇక ఈమె తన చదువుకుంటున్న సమయంలో చాలా బ్రాండ్ లకు మోడలింగ్ కూడా చేసింది.

Telugu Actressshivani, Actresssshivani, Emmaya, Knife, Nirbhaya, Shivani Singh-Movie

ఎన్డి టీవీ ప్రైమ్ లో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా బాధ్యతలు చేపట్టింది.అదే సమయంలో ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్నది.ఇక ఆడిషన్ లో పాల్గొన్న సమయంలో తను చాలా సమస్యలు ఎదురుకుందట.అయినా కూడా వాటిని ఎదుర్కొని సినిమాలలో అవకాశాల కోసం పోరాడానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Telugu Actressshivani, Actresssshivani, Emmaya, Knife, Nirbhaya, Shivani Singh-Movie

అంతేకాకుండా ఆడిషన్ సమయంలో తను చాలా నేర్చుకున్నాను అని తెలిపింది.ఇక తన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటానని తెలిపింది.ఎందుకంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే విషయాలు తెలుసుకోవచ్చని తెలిపింది.ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది.కేవలం సినీ రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది.

తాను కూడా కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

మహిళలకు సమస్యలు ఎక్కడైనా ఉంటాయని.ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత తాను కూడా హ్యాండ్ బ్యాగ్ లో కత్తి పెట్టుకుని తిరిగానని తెలిపింది.

Telugu Actressshivani, Actresssshivani, Emmaya, Knife, Nirbhaya, Shivani Singh-Movie

అంతేకాకుండా హాలీవుడ్ దర్శకుడు హర్వే విన్ స్టెయిన్ లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు మీటూ ఉద్యమం ద్వారా స్పందించారని తెలిపింది.తాను కూడా గతంలో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నానని తెలిపింది.తనపై తప్పుగా ప్రవర్తించిన వారిని గట్టిగా మందలించానని తెలిపింది.ఇక ఈమె విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో నటించగా ఎందుకో అంత సక్సెస్ కాలేకపోయింది.

#ActresssShivani #ActressShivani #Shivani Singh #Knife #Nirbhaya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube