విజయ్‌ దేవరకొండకు ఆ పాత్రలో నటించేంత దమ్ము ఉందా?  

Vijay Devarakonda Act In Tamil Talaivi Movie - Telugu Arjun Reddy Actor Vijay Devarakonda, Tamil Talaivi Biopic Shobhan Babu Chracter, Vijay Devarakonda, World Famous Lover Vijay Devarakonda

యంగ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం ఈయన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

Vijay Devarakonda Act In Tamil Talaivi Movie

ఆ సినిమాకు సంబందించిన షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

ఈ సమయంలోనే విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాల గురించి సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్‌ దేవరకొండ ‘తలైవి’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో విజయ్‌ ‘తలైవి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఆ సినిమాలో శోభన్‌ బాబు పాత్రను చేయాల్సిందిగా మేకర్స్‌ విజయ్‌ దేవరకొండను సంప్రదించాడట.అందుకోసం ఇప్పటికే చర్చలు జరిగాయని, ఓకే చెప్పాడంటూ ప్రచారం జరుగుతోంది.కాని తలైవి మేకర్స్‌ లేదా విజయ్‌ దేవరకొండ నుండి కాని ఎలాంటి సమాచారం అయితే ఇప్పటి వరకు రాకపోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

జయలలిత మరియు శోభన్‌ బాబులు గతంలో ప్రేమించుకున్నారని, ఇద్దరు కూడా పెళ్లి వరకు వెళ్లినా కూడా కొన్ని కారణాల వల్ల చేసుకోలేదు.పెళ్లి చేసుకోకున్నా వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా ఉందని అనుకున్నారు.ఆ విషయమై క్లారిటీ లేదు.శోభన్‌ బాబు బతికి ఉన్న సమయంలో జయలలిత గురించిన విషయాలు ఆయన నుండి తెలుసుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు.

కాని ఆయన మాత్రం అప్పటి విషయాలను ఇప్పుడు తీయడం ఇష్టం లేదన్నాడు.అలాంటి శోభన్‌ బాబు పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించడం అనుమానమే.ఎందుకంటే శోభన్‌ బాబు ఫ్యామిలీ నుండి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda Act In Tamil Talaivi Movie Related Telugu News,Photos/Pics,Images..