‘నోటా’ ఫ్లాప్‌కు కారణం చెప్పిన దేవరకొండ

విజయ్‌ దేవరకొండ చేసిన ద్విభాష చిత్రం ‘నోటా’ తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.అంతకు ముందు వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలు భారీ విజయాలు దక్కించుకున్న నేపథ్యంలో నోటా కూడా అదే స్థాయిలో ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు.

 Vijay Devarakonda About Nota Movie Flop-TeluguStop.com

కాని ప్రేక్షకుల అంచనాలు తారా మారు అయ్యాయి.ఏమాత్రం ఆకట్టుకోని కథ మరియు కథనంతో ఆ చిత్రంను ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కించాడు.

తెలుగులో ఒక మోస్తరు కలెక్షన్స్‌ను రాబట్టినా కూడా తమిళంలో మాత్రం ఒక్కబోర్లా పడటం జరిగింది.ఆ సినిమా ఫ్లాప్‌ గురించి తాజాగా విజయ్‌ దేవరకొండ అసలు విషయం చెప్పాడు.

‘నోటా’ ఫ్లాప్‌ను ఒప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన విజయ్‌ దేవరకొండ తన తప్పు ఉందని పేర్కొన్నాడు.నోటా చిత్రం షూటింగ్‌ సమయంలోనే ట్యాక్సీవాలా మరియు గీత గోవిందం షూటింగ్స్‌ కూడా ఉన్నాయని, దాంతో నోటా చిత్రంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టలేక పోయాను.ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో నోటా విడుదల అయ్యాక తెలిసింది.నోటా విడుదల తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను.ఇకపై ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయవద్దని నిర్ణయించుకున్నాను.

నోటా కథపై ఎక్కువ శ్రద్ద పెట్టకపోవడంతో పాటు, దర్శకుడు ఎలా చెబితే అలా చేసుకుంటూ పోయాను.ఆ కారణం వల్లే ఆశించిన స్థాయిలో సినిమా రాలేదు.తన మార్క్‌ ఆ సినిమాలో కనిపించక పోవడంకు కారణం కూడా హడావుడి అంటూ విజయ్‌ పేర్కొన్నాడు.

ఇకపై సంవత్సరానికి ఒక్కటి చొప్పున సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.విజయ్‌ దేవరకొండ తాజాగా ట్యాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నాడు.ఇక మరో వైపు డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో వచ్చే జూన్‌ లేదా జులైలో విజయ్‌ దేవరకొండ రాబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube