మహేష్‌ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌ దేవరకొండ!

యూత్‌ ఐకాన్‌గా యూత్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో నటిస్తున్నాడు.వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విజయ్‌కు యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉంది.

 Vijay Devara Konda Is After Mahesh Babu-TeluguStop.com

వరుస చిత్రాల్లో నటిస్తూనే పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.ఇప్పటికే చాలా కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్‌ వచ్చే ఏడాది లో చాలా సంస్థలకు ఒకే చెప్పనున్నట్టు సమాచారం.

అందుకు పలు సంస్థలు విజయ్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.

యూత్‌లో ఈయనకున్న క్రేజ్‌ కారణంగా చాలా సంస్థలో విజయ్‌తో ప్రమోట్‌ చేయించడానికి ముందుకు వస్తున్నాయి.అంతేకాకుండా విజయ్‌ తన క్రేజ్‌తో సంబంధం లేకుండా తన స్థాయిని బట్టి పారితోషికం తీసుకుంటున్నాడు.దాంతో చాలా కంపెనీలు విజయ్‌తో డీల్‌ కుదుర్చుకోవడానికి ఆసక్తి కనబర్చుతున్నాయి.

వచ్చే ఏడాది నాటికి దాదాపు డజన్‌ సంస్థలకు విజయ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నాడు.

తెలుగులో అత్యధిక కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసిన హీరో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు.ఈయన ప్రమోట్‌ చేసిన సంస్థల సంఖ్యను మరే తెలుగు హీరో కూడా చేరుకోలేకపోయాడు.మహేష్‌ తర్వాత ఆ స్థాయిని విజయ్‌ దక్కించుకోవడానికి సిద్దమయ్యాడు.

త్వరలో మహేష్‌ను బీట్‌ చేయనున్నాడు అనే టాక్‌ కూడా వినిపిస్తోంది.మొత్తానికి అత్యధిక కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరించిన హీరోల్లో మొదటి స్థానం మహేష్‌బాబుది కాగా ఆ తర్వాత స్థానంలో విజయ్‌ దేవరకొండ ఉండడం విశేషం!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube