రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కు యూత్ లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.విజయ్ దేవరకొండ అంటే కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా చాలా అభిమానం ఉంటుంది.
ఆయన అంటే పడిచచ్చే హీరోయిన్స్ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్ని చోట్లా ఉన్నారంటూ మీడియా లో రెగ్యులర్‌గా కథనాలు వస్తూనే ఉంటాయి.ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ కోసం అమెరికాలో పూరి జగన్నాథ్ మరియు ఛార్మి ఇతర యూనిట్ సభ్యులతో కలిసి ఉన్న విషయం తెలిసిందే.
అక్కడ యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు.అందుకోసం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ను కూడా అక్కడికి తీసుకు వెళ్లడం జరిగింది.
ఈ సినిమా కు చార్మి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రతి చోట కూడా ఆమె కనిపిస్తూనే ఉంది.
తాజాగా విజయ్ దేవరకొండ అనన్య పాండే మరియు చార్మి లతో కలిసి ఇలా క్లోజ్‌గా ఫోటోకి ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశమయింది.
ఇద్దరి మధ్య రౌడీ స్టార్ ముద్దుగా ఉన్నాడంటూ కొందరు కామెంట్ పెడుతున్నారు.ఈ ఫోటో చూస్తుంటే అనన్య పాండే తో పాటు ఛార్మి కూడా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తే బాగుండు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాత కూడా హీరోయిన్ ను మించి అందాలను ఒలకబోస్తూ ఆకట్టుకుంటుంది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.లైగర్ అమెరికా షెడ్యూల్ మరో వారం రోజుల్లో పూర్తి కాబోతున్నట్లు గా పూరి అండ్ టీమ్ చెప్తున్నారు.వచ్చే సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది.విజయ్ దేవరకొండ మొదటి ఇండియా పాన్ సినిమా అవడం వల్ల కచ్చితం గా దీనికి ఓ రేంజిలో బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.