25 ఏళ్లలో ఎప్పుడు లేనంత ఆందోళనలో ఉన్నాను  

Vijay Comments On It Raids His Master Audio Launch - Telugu It Raids Doing Bjp Party, It Raids On Vijay, Master Movie Audio Launch, Tamila Super Star Vijay, Vijay, Vijay Master Movie

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో తాజాగా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.

 Vijay Comments On It Raids His Master Audio Launch

ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా విజయ్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు.కరోనా కారణంగా ఫ్యాన్స్‌ను ఆహ్వానించని విజయ్‌ కొంత మంది చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు ప్రముఖులను ఆహ్వానించాడు.

ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో విజయ్‌ సరదాగా కామెంట్స్‌ చేశాడు.

25 ఏళ్లలో ఎప్పుడు లేనంత ఆందోళనలో ఉన్నాను-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గత కొన్ని రోజులుగా విజయ్‌ ఐటీ రైడ్స్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.

కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఈమద్య కాలంలో వరుసగా సినిమాల్లో ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తున్న కారణంగా విజయ్‌ని బీజేపీ టార్గెట్‌ చేసింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో ఆయన కూడా అదే విధంగా మాట్లాడాడు.గతంలో ఎప్పుడు లేని విధంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాను.25 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య రాలేదు.

ఇకపై అయిన ఈ ఐటీ రైడ్స్‌ ఆగితే కాస్త ప్రశాంతంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.అసలు తాను ఎప్పుడు కూడా ఐటీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు అన్నాడు.అయినా కూడా కొందరు నన్ను టార్గెట్‌ చేసి ఇలా చేస్తున్నారు అంటూ ఇండైరెక్ట్‌గా కామెంట్స్‌ చేశాడు.మాస్టర్‌ చిత్రంలో కూడా బీజేపీని టార్గెట్‌ చేస్తూ విజయ్‌ ఏమైనా కామెంట్స్‌ చేయడం లేదంటే సీన్స్‌ పెట్టడం ఉంటుందా చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Comments On It Raids His Master Audio Launch Related Telugu News,Photos/Pics,Images..

footer-test