బొగ్గు గనిలో రౌడీ రొమాన్స్  

Vijay Catherine Tresa Boggu Gani Romance In World Famous Lover - Telugu Boggu Gani, Catherine Tresa, Vijay Devarakonda, World Famous Lover

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి అదిరిపోయే సక్సె్స్‌ను అందుకోవడానికి రెడీ అయ్యాడు.

Vijay Catherine Tresa Boggu Gani Romance In World Famous Lover

ఈ సినిమాలో విజయ్ ఏకంగా నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాలో అందాల భామలు రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్య రాజేశ్‌లు మెయిన్ హీరోయిన్లుగా నటిస్తోండగా, ఓ ఫారిన్ బ్యూటీ కూడా నటిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేయగా ఈ సినిమాలో కేథరిన్ త్రేసాతో విజయ్ దేవరకొండ చేసే రొమాన్స్‌ ఓ రేంజ్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.వీరిద్దరి మధ్య నడిచే రొమాన్స్‌ను ‘బొగ్గు గనిలో’ అనే పాటలో మనకు చూపించనున్నారు చిత్ర యూనిట్.

గోపీ సుందర్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను జనవరి 29న సాయంత్రం 4.05 నిమిషాలకు మనముందుకు వదలనున్ననారు చిత్ర యూనిట్.

ఏదేమైనా అర్జున్ రెడ్డి రొమాన్స్‌ను మించి ఈ సినిమాలో మనకు రొమాన్స్ చూపంచనున్నాడట విజయ్ దేవరకొండ.

ఈ సినిమాను క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కెఎస్ రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు