సాహూని పక్కకి నెట్టేసిన విజయ్ బిగిల్ సినిమా! సౌత్ లో టాప్ చైర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సాహో.ఈ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 Vijay Bigil South India Years-TeluguStop.com

బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ ఈ సినిమాతో తన స్టామినా చూపించాడు.సౌత్ ఇండియా నుంచి మరో సారి వంద కోట్లకి పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది.

ఇక తెలుగులో కూడా వంద కోట్లకి పైగానే కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేదని, యాక్షన్స్ సీక్వెన్స్ బాగున్న కూడా కథ విషయంలో ఫెయిల్ అయ్యారని, రొటీన్ కథకి యాక్షన్ టచ్ ఇచ్చారని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

ఏది ఏమైనా సాహో సినిమా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం అయితే తీసుకొచ్చింది.అయితే కలెక్షన్స్ లో ఈ సినిమాని క్రాస్ చేయలేకపోయిన కూడా తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా అత్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే సౌత్ లో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో సాహో సినిమాని, అలాగే సైరా నరసింహారెడ్డి సినిమాలని పక్కకి నెట్టి బిగిల్ నెంబర్ వన్ గా నిలబడింది.సౌత్ లో 250 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడంతో పాటు, అత్యధిక జనాదరణ కలిగిన సినిమాల జాబితాలో బిగిల్ టాప్ లో నిలబడింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడించిన ఈ సినిమా తుపాకి తర్వాత విజయ్ గా తెలుగులో హిట్ ఇచ్చిన రెండో సినిమా కావడం విశేషం.అయితే కేవలం తమిళ, తెలుగు భాషలకే పరిమితమైన ఈ సినిమా సౌత్ లో అత్యధిక కలెక్షన్ చిత్రంగా నిలిచింది.

బిగిల్ కంటే సాహోకి, సైరాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన కూడా ఈ రెండు ఎక్కువ భాషలలో రిలీజ్ చేయడం వలన వీటికి టాప్ లో స్థానం లభించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube