విజయ్ బీస్ట్.. తెలుగులో భారీ స్కెచ్..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద కన్నేశాడు.విజయ్ హీరోగా నెల్సన్ డైరక్షన్ లో వస్తున్న బీస్ట్ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అందుకు విజయ్ టీం దిల్ రాజుతో చేతులు కలిపింది.ఆల్రెడీ విజయ్ తో వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు ఒక సినిమా చేస్తున్నారు.ఇదే క్రమంలో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న బీస్ట్ సినిమా బాధ్యత కూడా దిల్ రాజు మీద వేసుకున్నాడని తెలుస్తుంది.విజయ్ బీస్ట్ ను తెలుగు రెండు రాష్ట్రాల్లో 20 కోట్ల బిజినెస్ చేసేలా చూస్తున్నారు.

 Vijay Beast Telugu Release Huge Plan , Dil Raju, Kollywood Vijay , Latest Movie-TeluguStop.com

విజయ్ బీస్ట్ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.అయితే సినిమాకు భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.అప్పుడెప్పుడో తుపాకి సినిమాకు విజయ్ తెలుగు ఈవెంట్ కు వచ్చాడు.ఆ తర్వాత అడపాదడపా ఆయన సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నా ప్రమోషన్స్ కు ఆయన రావట్లేదు.

కాని విజయ్ బీస్ట్ సినిమాకు మాత్రం తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు.ఇదంతా దిల్ రాజు ఆధ్వర్యంలో ప్లాన్ చేస్తున్నారట.

విజయ్ సినిమా తెలుగులో ప్రమోట్ చేస్తే అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube