ప్రేమ కథ చిత్రాల్లో నటించాలనుంది : విజయ్ ఆంటోని

భారతీయ సినీ నటుడు విజయ్ ఆంటోని.ఈయన నటుడుగానే కాకుండా గాయకుడిగా, గేయ రచయితగా, చిత్ర నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Vijay Antony Intrested To Do Love Stories-TeluguStop.com

ఇక ఈయన నటించిన సినిమాలు ఎంతో ఆకర్షణీయంగా, ఆసక్తిగా ఉంటాయి.ఇప్పటికీ ఈయన హోమ్లీగా ఉండే కథలనే ఎంచుకుంట‌ారు.

ఇక ఈ నటన ఎంతగానో అభిమానులను ఆకట్టుకుంది.

 Vijay Antony Intrested To Do Love Stories-ప్రేమ కథ చిత్రాల్లో నటించాలనుంది : విజయ్ ఆంటోని-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విజయ్ ఆంటోని ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ , యాక్షన్ థ్రిల్లర్ లో కూడా నటిస్తారు.

ఎక్కువ తమిళ సినిమాలలో నటించే ఆయన తమిళ నటుడు గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగులో బిచ్చగాడు, భేతాళుడు, డా.సలీం సినిమాల ద్వారా బాగా తెలుగు అభిమానులను గెలుచుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయనకు ప్రేమకథ సినిమాలలో నటించాలని ఉందట.

ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ‘కొడియిల్ ఒరువన్‍‘ సినిమా.ఈ సినిమాలో విజయ్ ఆంటోని, ఆత్మిక నటీనటులుగా నటించారు.ఈ సినిమాకు చెందూర్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు టి.డి రాజా, డి.ఆర్ సంజయ్ కుమార్ లు నిర్మించారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి పాత్రికేయుల సమావేశంలో విజయ్ ఆంటోని కొన్ని విషయాలు మాట్లాడాడు.

ఈ సినిమాలో సమాజ హితం కోరే ఓ ట్యూషన్ మాస్టర్ కథగా తెరకెక్కనుందట‌.ఇందులో అతడికి ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనే నేపథ్యంలో రానుంది.

ఇక ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని విజయ్ ఆంటోని తెలుపగా.ఆయనకు చాలా కాలం నుంచి ప్రేమకథా చిత్రాల్లో నటించాలని ఉందట.

కానీ తన ఆశ నెరవేరడం లేదని వ్యక్తం చేశాడు.ఇక ఈ సినిమాను ఏప్రిల్ నెలలో థియేటర్ లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ డైరెక్టర్ ఆనంద్ కృష్ణన్ తెలిపాడు.

#Intrested #Vijay Antony #Love Stories

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు