బిచ్చగాడు సీక్వెల్ దర్శకురాలిగా ప్రియా కృష్ణస్వామి

తెలుగు, తమిళ బాషలలో రిలీజ్ అయినా విజయ్ అంటోనీ బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయినా ఈ సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఊహించని స్థాయిలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

 Priya Krishnaswamy As A Director For Bichagadu Sequel,   Vijay Antony, Bichhagad-TeluguStop.com

తమిళంలో కంటే తెలుగు ఈ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఏకంగా 25 కోట్లు వరకు కలెక్ట్ చేసింది.

ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.సినిమా కథలో ఉన్న అమ్మ సెంటిమెంట్, స్క్రీన్ ప్లే తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది.

దీంతో విజయ్ అంటోనీ కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా బిచ్చగాడు నిలిచింది.ఈ సినిమా తర్వాత తెలుగులో విజయ్ అంటోనీ సినిమాపై ప్రేక్షకులకి ఆసక్తి పెరిగింది.

ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత బిచ్చగాడు సీక్వెల్ కి విజయ్ అంటోనీ ప్లాన్ చేశాడు.ఈ సినిమా కోసం కథ కూడా అతనే రాసాడు.దీంతో బిచ్చగాడు సీక్వెల్ తో మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత, హీరో, రచయితగా నాలుగు క్రాప్స్ లో విజయ్ భాగం అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి దర్శకులుగా ఎవరిని తీసుకుంటారు అనే ఆసక్తి ఏర్పడింది.

తాజాగా ఆ ఆసక్తి మరింత పెంచే విధంగా జాతీయ అవార్డు గ్రహీత అయినా ప్రియా కృష్ణస్వామిని సీక్వెల్ దర్శకురాలిగా విజయ్ ఎంపిక చేశాడు.ఆమె గతంలో నాలుగు డాక్యుమెంటరీలు, ఒక హిందీ సినిమా, ఒక తమిళ సినిమా తీసింది.

ఆమె సినిమా చాలా సహజంగా నేచురాలిటీకి దగ్గరగా ఉంటాయి.ఇప్పుడు ఆమెని ఈ సినిమాకి దర్శకురాలిగా ఎంపిక చేయడం ద్వారా విజయ్ తన సినిమా ఎలా ఉండాలని అనుకుంటున్నాడో చెప్పకనే చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube