ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న విజయ్ -పూరి జనగణమన!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న లైగర్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది.

 Vijay And Puri Janaganamana Movie Is Go On Sets In April Vijay Devakonda, Tollyw-TeluguStop.com

ఇక ఈ సినిమాని ఆగస్ట్ 25 వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఎన్నో సంవత్సరాల నుంచి పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉండిపోయిన జనగణమన సినిమాని విజయ్ దేవరకొండతో చేయాలని పూరిజగన్నాథ్ భావించినట్లు మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ప్రకటించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులపై శ్రద్ధ పెట్టారు.దాదాపు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి కావచ్చని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి ఈ సినిమాని ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి తీసుకురావాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఏప్రిల్ నెలలో మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మేజర్ షూటింగ్ కోసం అమెరికాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం.పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ ఈ పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా గురించి మిగిలిన సమాచారం త్వరలోనే చిత్రబృందం అధికారకంగా తెలియజేయనునట్లు తెలుస్తోంది.

Vijay And Puri Janaganamana Movie Is Go On Sets In April Vijay Devakonda

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube