'దళపతి67'పై ఆసక్తికర బజ్.. టైటిల్ ఇదేనంటూ నెట్టింట హడావిడి!

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా సృష్టించిన సంచలనంతో లోకేష్ నెక్స్ట్ సినిమాపై భారీ హోప్స్ పెరిగాయి.

 Vijay And Lokesh Kanagaraj Thalapathy 67 Title, Thalapathy 67, Thalapathy Vijay,-TeluguStop.com

మరి లోకేష్ నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ దళపతితో తన నెక్స్ట్ సినిమా ప్రకటించాడు.ఇటీవలే విజయ్ వారిసు సినిమాతో వచ్చి 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంది.

ఇక ఈ సినిమా అలా పూర్తి కాగానే వెంటనే విజయ్ లోకేష్ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు.మొన్ననే చెన్నై లో గ్రాండ్ గా లాంచింగ్ ఈవెంట్ జరిగింది.

మరి ఈ సినిమా స్టార్ట్ కావడం నుండే పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను ఇస్తూ ఈ సినిమాపై అందరి ఫోకస్ పడేలా చేస్తున్నారు.ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అనౌన్స్ చేస్తామని అఫిషియల్ గా పోస్టర్ తో ప్రకటించారు.

Telugu Thalapathy, Trisha, Vijaylokesh-Movie

దీంతో ఈ సినిమా టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే అఫిషియల్ గా టైటిల్ అనౌన్స్ చేయకముందే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమా టైటిల్ ‘కే’ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అని.అలాగే ఇంగ్లీష్ లో 7 అక్షరాలు ఉంటాయని సాలిడ్ హింట్ బయటకు రావడంతో ఈ సినిమా టైటిల్ ”ఖైదీ 2” అయి ఉంటుంది అంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.

Telugu Thalapathy, Trisha, Vijaylokesh-Movie

మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొంత కాలం వైట్ చెయ్యాల్సిందే.ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తుండగా.సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube