మహేష్ కోరాడు విజయ్ నెరవేర్చాడు!  

Vijay Accepts Mahesh Babu Green India Challenge, Mahesh Babu, Vijay, Green India Challenge, Twitter - Telugu Green India Challenge, Mahesh Babu, Twitter, Vijay

టాలీవుడ్‌లో లాక్‌డౌన్ సమయంలో చాలా మంది హీరోలు పలు ఛాలెంజ్‌లను చేస్తూ కనిపించారు.ఇందులో చాలా మంది #BeAManChallenge అనే ఛాలెంజ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - Vijay Accepts Mahesh Babu Green India Challenge

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా టాలీవుడ్‌లో స్టార్స్ అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేపడుతున్నారు.కాగా ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నాడు.

TeluguStop.com - మహేష్ కోరాడు విజయ్ నెరవేర్చాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ పుట్టినరోజును కాస్త విభిన్నంగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఓ మొక్కను నాటడం జరిగింది.ఈ విధంగా తనకు పర్యావరణ పరిరక్షణపై ఎలాంటి బాధ్యత ఉందో తెలియజేశాడు.

ఇక తన పుట్టినరోజున చేస్తున్న ఈ మంచి పనిని మరికొందరు కూడా చేయాల్సిందిగా ఆయన కోరాడు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, అందాల భామ శృతి హాసన్‌లు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా వారి పేర్లను నామినేట్ చేశాడు.

కాగా తాజాగా మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను తమిళ హీరో విజయ్ స్వీకరించాడు.ఆయన కూడా తన ఇంటి పరిసరాల్లో ఒక మొక్కను నాటాడు.

‘మహేష్ ఇది నీ కోసమే’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇలా ఓ స్టార్ హీరో ఛాలెంజ్ విసరడం, మరో స్టార్ హీరో దాన్ని స్వీకరించి చేయడం వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెలుపుతుందని ఆయా హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.

#Mahesh Babu #Vijay #GreenIndia #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Accepts Mahesh Babu Green India Challenge Related Telugu News,Photos/Pics,Images..