విజయ్ 27 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడిందిగా!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Vijay 27 Years Record Ended, Vijay, Master, Kollywood News, Tamil Movie News-TeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చి దిద్దడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే కరోనా కారణంగా విజయ్ గత 27 ఏళ్లుగా నిలబెట్టుకొస్తున్న ఓ రికార్డు బ్రేక్ కానుంది.తమిళ హీరోల్లో విజయ్ ఎక్కువ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటాడు.

ఏడాదిలో కనీసం ఒకటి లేదా రెండు సినిమాలతో తమిళ తంబీలను ఖుషీ చేస్తున్న విజయ్, తొలిసారి ఒక ఏడాదిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలుగా చిత్ర షూటింగ్‌లు ఆగిపోవడంతో విజయ్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పట్లో తెరకెక్కించే అవకాశం కూడా లేకపోవడంతో, విజయ్ ఈఏడాదిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఉండిపోయాడు.

ఇలా తన 27 ఏళ్ల రికార్డు్కు కరోనా బ్రేక్ వేయడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.ఇక మాస్టర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాలో విజయ్‌ను ఢీకొట్టే పాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయ్ రికార్డుల మోత మోగించేందుకు రెడీ అవుతున్నాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube