హిందువులు విగ్రహారాధనను ఎందుకు నమ్ముతారు?  

 • ఇంటిలో విగ్రహారాధన
  ఇతర మతాలలో వలే కాకుండా హిందువులు విగ్రహారాదన చేస్తారు. దేవుని అవతారంగా విగ్రహాలను పూజిస్తారు. ఇంటిలో ప్రత్యేకంగా ఒక దేవుడి గదిని ఏర్పాటు చేసి, అక్కడ విగ్రహాలను పెట్టి భక్తితో పూజలు చేస్తారు.

 • హిందువులు విగ్రహారాధనను ఎందుకు నమ్ముతారు?
  దేవుడు వారి జీవితాల్లో అంతులేని బలం మరియు శక్తిని ఇస్తాడని నమ్మకం. అలాగే సమస్యల నుండి బయట పడటానికి సహాయం మరియు చెడు చేయకుండా మనస్సులో భయాన్ని కలిగిస్తారు.

 • శాస్త్రాలు ఏమి చెప్పుతున్నాయి?
  హిందు మతంలో శాస్త్రాలు ప్రతి ఇంటిలో దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలని మరియు విగ్రహాలకు నియమంగా పూజలు చేయకపోతే వ్యతిరేక ప్రభావాలు వస్తాయని చెప్పుతున్నాయి.

 • పూజ గది ప్రత్యేకంగా ఉండాలి
  బెడ్ రూంతో కలిపి పూజ గది ఉండకూడదు. ఎందుకంటే దేవుని ముందు ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడకూడదు. అందువల్ల పూజ గది ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. అలాగే పూజ గది తూర్పు ముఖంగా ఉంటే మంచిది.

 • వంట గదిలో ఉండకూడదు
  ఇంటిలో వంటగది అనేది స్వచ్ఛమైన మరియు పరిశుభ్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. కానీ చాలా కుటుంబాలు వంటగదిలో డస్ట్ బిన్ ని పెడుతూ ఉంటాయి. అలాగే వంటగదిలో పొగ కూడా వస్తుంది. అందువల్ల దేవుని గదిగా ఉపయోగించటానికి వంటగది అనువైన ప్రదేశం కాదు.

 • అన్నిటికంటే పూజగది స్థానం ముఖ్యం
  రెండు అంతస్థులు లేదా ఎత్తైన ప్రదేశంలో నివసిస్తున్న వారు దేవుని గదిని టాయిలెట్ ప్రాంతం కింద లేదా పక్కన లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక పవిత్రమైన పూజ గది అనారోగ్యమైన ప్రాంతంలో ఉంటే పాపం కలుగుతుంది.

 • పూజగదికి తాళం వేయకూడదు
  సెలవులను ఎక్కువ రోజులు గడపటానికి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు పూజగదికి తాళం వేయకూడదు. ఎందుకంటే ఇంటి చుట్టు ఉన్న ప్రసన్నమైన శక్తి బ్లాక్ అవుతుంది.

 • దేవుని గదిని శుభ్రం చేయాలి
  దేవుడి గదిని ప్రతి రోజు శుభ్రం చేయాలి. ప్రతి రోజు విగ్రహాలను మరియు పోటోలను శుభ్రంగా తుడవాలి. ఎప్పుడు పూజగదిని అపవిత్రంగా ఉంచకూడదు.