నయన్ లో నచ్చిన విషయం ఇదే.. విఘ్నేష్ కామెంట్స్ వైరల్..?

సౌత్ ఇండియాలో ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నయనతార ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.కరోనా విజృంభిస్తున్న సమయంలో సైతం నయనతార తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు.

 Vignesh Shivan Reveals Quality Nayanatara Which Admires Him Most-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన విఘ్నేష్ శివన్ నయనతారకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

కోలీవుడ్ ప్రేమజంటగా పేరు తెచ్చుకున్న నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నా ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు.నయన్ విఘ్నేష్ పెళ్లికి సంబంధించి గతంలో కొన్ని వార్తలు వైరల్ అయినా ఆ వార్తలకు సంబంధించి ఈ జోడీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.

 Vignesh Shivan Reveals Quality Nayanatara Which Admires Him Most-నయన్ లో నచ్చిన విషయం ఇదే.. విఘ్నేష్ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో విఘ్నేష్ నెటిజన్లతో మాట్లాడగా ఒక నెటిజన్ నయనతార నచ్చిన విషయం ఏమిటని విఘ్నేష్ శివన్ ను ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు విఘ్నేష్ శివన్ స్పందిస్తూ నయనతార సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.నయనతారతో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అదే తన ఫేవరెట్ పిక్ అని విఘ్నేష్ శివన్ తెలిపారు.గడిచిన ఆరు సంవత్సరాలుగా నయన్, విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమాయణం కొనసాగుతూ ఉండటం గమనార్హం.

ప్రస్తుతం విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాతువాకుల రెండు కాదల్ సినిమాలో నయనతార నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు నయనతార అన్నాత్తే, నేట్రిగన్ సినిమాలలో నటిస్తున్నారు.ఈ సినిమాలు కాకుండా నయన్ చేతిలో మరో నాలుగు సినిమా ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది.తమిళనాడులో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో త్వరలో షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

#Kollywood #Vighnesh Shivan #Nayanatara #Reveals Quality

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు