నా పిల్లలకి తల్లి కాబోతున్న నయనతార అంటున్న దర్శకుడు

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ కథల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె జీవితంలో ఎన్ని లవ్ ఫెయిల్యూర్స్ ఉన్న కూడా వాటిని అధికమించి సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా నయనతార ఎదగడం గొప్ప విషయం అని చెప్పాలి.

 Vignesh Shivan Calls Nayanthara Mother Of My Future Children, Tollywood, Kollywo-TeluguStop.com

కెరియర్ ఆరంభంలో శింబుతో ప్రేమాయణం, తరువాత ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లి వరకు వచ్చి బ్రేక్ అప్ అవడం జరిగింది.అయితే ఇప్పుడు ఈ భామ మరల తమిళ ఇండస్ట్రీలో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది.

ఇక వారు ఎక్కడికి వెళ్ళిన కలిసి వెళ్ళడం, అప్పుడప్పుడు వీకెండ్స్ కి ఎక్కడో ఒక చోటకి వెళ్ళడం చేస్తూ ఉంటారు.వీరి మధ్య ప్రేమ అనేది సౌత్ ఇండస్ట్రీలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం.

ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్‌ లో విఘ్నేష్‌ శివన్‌ని నయనతార హబ్బీ అని సంబోధించారు.తాజాగా మదర్స్‌ డే సందర్భంగా విఘ్నేష్‌ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

నయనతార చిన్న పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో అది.దానికి ఈ విధంగా క్యాప్షన్‌ చేశారు.భవిష్యత్తులో నా పిల్లలకు తల్లి కాబోయే తనకి మదర్స్‌ డే శుభాకాంక్షలు అని పేర్కొన్నారు విఘ్నేష్‌.ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ వార్తలకు ఈ కామెంట్‌ మరింత బలాన్ని చేకూర్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube