పెళ్ళికి ముందే పిల్లలను కంటారా.. విగ్నేష్‌ని ప్రశ్నించిన నెటిజన్!

విగ్నేష్ అనే పేరు చాలా వరకు పరిచయం లేని పేరు.కానీ నయనతార ప్రియుడు అంటే మాత్రం బాగా పరిచయమున్న పేరు.

 Vignesh Shivan Counter To Netizen On Asking Baby With Nayanathara , Vignesh Shiv-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు, సినీ దర్శకుడు విగ్నేష్ శివన్.ప్రస్తుతం ఈయన తన దర్శకత్వంలో తన ప్రియురాలి నయనతారతో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే ఈ జంట ఎన్నో ఏళ్ళ నుండి ప్రేమ లో ఉంటున్నారు.

పైగా ఈ జంట పెళ్లి చేసుకోనున్నట్లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక విగ్నేష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటాడు.

అంతేకాకుండా నయనతార తో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో బాగా పంచుకుంటాడు.ఇక వీరి ఫోటోలు క్షణంలో వైరల్ గా మారుతాయి.పైగా విగ్నేష్ కు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.నయనతార సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండకపోవడంతో చాలా వరకు విగ్నేష్ కు ఫాలోయింగ్ ఎక్కువైంది.

ఇదిలా ఉంటే విగ్నేష్ కి పెళ్లికి ముందే పిల్లలు కంటారా అనే ఓ ప్రశ్న ఎదురయింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే విగ్నేష్ అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తుంటాడు.

అంతేకాకుండా వాళ్లు చేసిన కామెంట్స్ కూడా వెంటనే స్పందిస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే ఇటీవలే విగ్నేష్ తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించాడు.ఇక అందులో ఎంతోమంది ఆయనను నయనతార గురించి ప్రశ్నించారు.దానికి విగ్నేష్ వెంటనే స్పందించడంతో.

నయనతార గురించి అడుగుతుంటే గర్వంగా ఉందని తెలిపాడు.

Telugu Nayanathara, Vignesh Shivan, Vigneshshivan-Movie

ఇక ఓ నెటిజన్ ఓ బిడ్డను నేను ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చా అని ప్రశ్నించగా దానికి విగ్నేష్ అది మీ భాగస్వామి, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.అంతేకాకుండా మరో నెటిజన్ నయనతారను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేయమని అడగగా ముద్దు పెట్టుకునే బిజీలో నేనుంటే ఫోటో తీయడానికి ఎవరూ లేరు అని కౌంటర్ వేసాడు విగ్నేష్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube