మాస్టర్ హక్కులతో విజిల్ వేస్తున్న నిర్మాత  

Vigil Movie Producer Bags Vijay Master Movie Telugu Rights - Telugu Kollywood News, Master Movie, Telugu Dubbing, Telugu Rights, Vigil, Vijay, Vijay Master

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘విజిల్’ తమిళంలో ఎంతపెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ అంతే హిట్ అయ్యింది.అంతకు ముందే తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్, విజిల్ సినిమాతో ఆ మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు.

Vigil Movie Producer Bags Vijay Master Movie Telugu Rights

ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా రెడీ చేస్తున్న విజయ్, ఆ సినిమాకు తెలుగులో ‘మాస్టర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.ఈ సినిమాతో విజయ్ మరోసారి తన సత్తాను చాటాలని చూస్తున్నాడు.

ఈ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్.ఆయన నటించిన విజిల్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ వారు మాస్టర్ సినిమా తెలుగు హక్కులను కూడా చేజిక్కించుకున్నారు.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.కాగా ఇటీవల ఖైదీ సినిమాతో కార్తీకి బంపర్ హిట్ అందించిన లోకేష్ కనకరాజ్ విజయ్‌తో మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నాడు.

ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test