నయనతార వల్ల నా జీవితం పరిపూర్ణమైంది.. విఘ్నేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కొన్ని నెలల క్రితం ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.త్వరలో నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి జరగనుంది.

 Vighnesh Shivan Instagram Post Goes Viral In Social Media , Goes Viral , Instagr-TeluguStop.com

నిన్న నయనతార పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా నయనతార పుట్టినరోజు సందర్భంగా విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం నయనతార విఘ్నేష్ శివన్ వేర్వేరుగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

నయనతార విఘ్నేష్ శివన్ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు ప్రతి సందర్భంలో ఒకరిపై మరొకరు ప్రేమను చాటుకుంటున్నారు.ఒక సినిమా షూటింగ్ సమయంలో నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు.

విఘ్నేష్ శివన్ నయనతారతో కేక్ కటింగ్ చేయడంతో పాటు ప్రేమతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.ఈ వేడుకకు సమంత హాజరు కాగా నయనతార బర్త్ డే ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

విఘ్నేష్ శివన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నయనతార ప్రేమ, ఆప్యాయత వల్ల తన లైఫ్ పరిపూర్ణమైందని చెప్పుకొచ్చారు.నయనతార పుట్టినరోజు సందర్భంగా నయనతార ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, అందంగా ఉండాలని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేశారు.

భగవంతుని ఆశీస్సులు నయనతారకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.

నయనతార పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరగగా నయనతార, విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కాతు వాకుల రెండు కాదల్ త్వరలో రిలీజ్ కానుంది.కాతువాకుల రెండు కాదల్ సినిమాలో నయనతార కన్మణి అనే రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.నయనతార తెలుగులో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తున్నారు.

నయనతారకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube