నయన్‌ ప్రియుడి నోటి దూల... సినిమాకు కోట్ల నష్టం

నయనతార ప్రస్తుతం కొలయుతిర్‌ కాలం అనే హర్రర్‌ చిత్రంలో నటిస్తుంది.ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి కావచ్చింది.

 Vigensh Shivan About Kolaiyuthir Kaalam Movie-TeluguStop.com

త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈమద్య కాలంలో నయనతార నటించిన ప్రతి సినిమా కూడా మంచి వసూళ్లను సాధిస్తున్న నేపథ్యంలో కొలయుతిర్‌ కాలం చిత్రం కూడా పెద్ద మొత్తంలో బిజినెస్‌ చేస్తుందని అంతా భావించారు.

కొన్ని రోజుల క్రితమే శాటిలైట్‌ మరియు డిజిటల్‌ రైట్స్‌కు సంబంధించిన ఒప్పందం కూడా అయినట్లుగా వార్తలు వచ్చాయి.అయితే తాజాగా సినిమా గురించిన నయనతార లవర్‌ విఘ్నేష్‌ శివన్‌ చేసిన వ్యాఖ్యలతో సినిమాకు పెద్ద డ్యామేజీ అయ్యింది.

‘కొలయుతిర్‌ కాలం’ సినిమాను తాను కొద్ది మేరకు చూశాను అని, అది అసంపూర్తిగా ఉందని, కథ కూడా కాస్త సంతృప్తి కరంగా లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.ఒక దర్శకుడు అయిన విఘ్నేష్‌ శివన్‌ను సినిమా మెప్పించలేదు కనుక ఖచ్చితంగా సినిమా ఆకట్టుకోదని, అందులో ఎలాంటి డౌట్‌ లేకుండా సినిమా మొత్తం కూడా నిరాశ పర్చుతుందని అంతా భావిస్తున్నారు.సినిమాకు నెగటివ్‌ ప్రచారం మొదలైన నేపథ్యంలో చిత్ర నిర్మాత ఇప్పుడు విఘ్నేష్‌ శివన్‌పై ఫైర్‌ అవుతున్నాడు.తన సినిమాను ఎవరు కొనేందుకు రావడం లేదు అంటూ చట్టపరమైన చర్యలకు సిద్దం అవుతున్నాడు.

తన సినిమా విడుదల కాకుండానే విఘ్నేష్‌ వ్యాఖ్యలు చేశాడు, ఆయన వ్యాఖ్యల వల్ల సినిమాకు చాలా నష్టం జరిగింది.కొనుగోలు చేసిన వారు, కొనుగోలు చేయాలనుకున్న వారు వెనక్కు తగ్గుతున్నారని, పాతిక కోట్ల బిజినెస్‌ అవుతుందని భావించిన సినిమా ఇప్పుడు పది కోట్లు కూడా కావడం లేదని, ఈ నష్టంకు కారణం విఘ్నేష్‌ శివన్‌.

అందుకే ఆయన ఈ నష్టంను భర్తి చేయాల్సిందే అంటూ నిర్మాత మీడియా ముందు గగ్గోలు పెడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube