నిన్న పత్రిక, నేడు టీవీ.. ఇక అంతరించి పోయే జాబితా ఇదే !

మనం ముందు నుంచి టీవీలో వీక్షకుల సంఖ్య తగ్గిపోతుంది అని ఉదాహరణలతో సైతం చూపిస్తూ వస్తూనే ఉన్నాం.ఫ్లాప్ అయిన సినిమా ఆయన హిట్ అయిన సినిమా అయినా ఎంత డబ్బుకు కొన్నా సరే టీవీలో వేస్తే వచ్చే రేటింగ్ చాలా దారుణంగా పడిపోతూ వస్తోంది.

 Viewers Are Getting Down For Tv , Viewers, Tv, Print Media, Subtitles, Ott, Movi-TeluguStop.com

గతంలో కేజిఎఫ్, సినిమాలు కొని వేసినా కూడా రేటింగ్ లో పెద్ద మార్పు కనిపించలేదు.గతంలో మీడియా ఉదృతి బాగా ఉన్న రోజుల్లో ప్రింట్ మీడియా పని అయిపోయింది.

ఇక ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్ బాగా పరిధిని పెంచుకోవడంతో టీవీలో సినిమాలు చూసే వారి సంఖ్య క్రమక్రమేణా పడిపోతూ వస్తుంది.అంతేకాదు టీవీలో ప్రకటనలకు డబ్బులు వెచ్చించే వారి సంఖ్య కూడా పడిపోతూ ఉండడం విశేషం.

Telugu Print, Subtitles, Viewers, Viewers Tv-Telugu Stop Exclusive Top Stories

థియేటర్లో ఎలాగు సినిమా ఆడలేదు కాబట్టి టీవీలో అయినా వేసి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్న వారికి పెద్ద షాక్ తగిలినట్టే బాగా ఆడిన సినిమాలను ఎక్కువ డబ్బు పెట్టి కొని టీవీలో వేసిన ఎవ్వరు చూడటం లేదు.ఇప్పుడు ఉన్న పరిస్థితుల కన్నా కూడా రానున్నది మరింత గడ్డు కాలమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి టీవీలో సినిమా వస్తే ముందుకు, వెనక్కి జరపలేము, నచ్చిన టైంలో చూడలేము, సినిమా వేసే టైం కి మనం ఎక్కడున్నా కూడా టీవీ ముందుకు రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం.అదే ఓటీటి అనుకోండి.

ఎంచక్కా నచ్చినప్పుడు చూడొచ్చు.

Telugu Print, Subtitles, Viewers, Viewers Tv-Telugu Stop Exclusive Top Stories

పైగా ఇతర భాషల సినిమాలను కూడా సబ్ టైటిల్స్ తో మనకు టైం ఉన్నప్పుడల్లా చూసుకునే వెసులుబాటు ఉంది.ఏదైనా నచ్చకపోతే ఫార్వర్డ్ చేయొచ్చు మళ్ళీ చూడాలనుకుంటే రివైండ్ చేయొచ్చు.ఇన్ని సదుపాయాలు అందుబాటులో ఉండగా టీవీ ముందు కూర్చోవడానికి ఎవరి ఇష్టపడతారు చెప్పండి.

కోవిడ్ టైంలో టీవీ చూసే వారి సంఖ్య పెరిగిందని అందరూ పొంగిపోయారు కానీ అప్పటికి ఓటీటి విజృంభన మొదలవలేదు.ప్రస్తుతం కరోనా లేదు అయినా కూడా టీవీ చూసేవారు లేరు ఇప్పటికే 40% కి పైగా జనాలు టీవీ చూడటం మానేశారు.

ఇక ముందు ఉంది గడ్డు కాలమే సుమ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube