అంకుల్ శవాన్ని సమాధిలో నుంచి తవ్విన వ్యక్తి.. కారణం తెలిసి ఫ్యూజులు ఔట్..

వియత్నాం దేశంలో( Vietnam ) ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది.

ఈ దేశంలోని థాన్ హోవా ప్రావిన్స్‌లో( Thanh Hoa Province ) నివసించే 37 ఏళ్ల "లు థాన్ నామ్"( Lu Thanh Nam ) అనే వ్యక్తి తన అంకుల్ సమాధిని తవ్వి అతడి శవాన్ని అక్కడినుంచి వేరే చోటికి తీసుకెళ్లాడు.తర్వాత ఎముకలను ఒక మూటగా కట్టి ఆ విషయాన్ని కుటుంబానికి తెలియజేశాడు.అంకుల్ ఎముకలను మళ్లీ ఉన్నచోట ఉంచాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని అతడు బ్లాక్ మెయిల్( Blackmail ) చేయడం ప్రారంభించాడు.

ఇలాంటి నేరానికి అతను పాల్పడతాడని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేకపోయారు.ఇలా ఎందుకు చేశాడంటే అతను కోట్లాది రూపాయల అప్పుల్లో ఉన్నాడు.ఈ అప్పులను తీర్చడానికి తన కుటుంబాన్ని బెదిరించాలని నిర్ణయించుకున్నాడు.

అంకుల్ ఎముకలను చూపిస్తూ, ఈ ఎముకలను తిరిగి ఇవ్వాలంటే కోట్లాది రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు.ఈ ఘటన గురించి తెలిసే చాలామంది షాక్ అవుతున్నారు.

ప్రజలు ఈ వ్యక్తి చేసిన పనిని తప్పుబట్టారు.సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ వ్యక్తి తన అంకుల్ సమాధిలో( Uncle Grave ) 20 సెంటిమీటర్ల లోతు గొయ్యి తీశాడు.ఆ తర్వాత ఎముకలను దొంగతనం చేసి, వాటిని చెత్త కుప్పలో దాచాడు.తన బంధువు భార్యకు అనామకంగా ఫోన్ చేసి, అంకుల్ ఎముకలను తన దగ్గర ఉంచుకున్నానని, వాటిని తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు.

పోలీసులకు చెప్పినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

ఈ బెదిరింపు ఫోన్ కాల్ తర్వాత బంధువులు వెంటనే సమాధిని పరిశీలించారు.సమాధిపై గుర్తు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఈ ఘటనను విచారించి, లు థాన్ నామ్ అనే వ్యక్తే దొంగతనం చేసినట్లు గుర్తించారు.

ఈ వ్యక్తిని అరెస్టు చేశారు.అతని దగ్గర నుండి దొంగతనం చేసిన ఎముకలను స్వాధీనం చేసుకుని, బంధువులకు తిరిగి ఇచ్చారు.

వృద్ధుడి కాలు కత్తిరించిన ఆస్ట్రేలియన్‌ అధికారులు.. ఎందుకో తెలిస్తే..
అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?

వియత్నాం చట్టాల ప్రకారం, ఈ నేరాలకు 7 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.వియత్నాం సంస్కృతి ప్రకారం, సమాధిని దోచుకోవడం చాలా అశుభం.

దీని వల్ల మరణించిన వారి ఆత్మ శాంతికి భంగం కలుగుతుందని, జీవించి ఉన్నవారి జీవితాలపై ప్రభావం పడుతుందని నమ్ముతారు.

తాజా వార్తలు