దారుణం.. బికినీ ధరించిందని విడాకులు ఎప్పుడు అంటూ లేడీ కమెడియన్ పై కామెంట్?

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించినటువంటి విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా లేడీ కమెడియన్ స్నేహితుడిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Vidyullekha Raman React On Instagram Trolls About Wearing Bikini, Vidyullekha Ra-TeluguStop.com

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే విద్యుల్లేఖ రామన్ దంపతులు వివాహం తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు.

ఈ క్రమంలోనే మాల్దీవుల అందాలను వీక్షిస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను విద్యుల్లేఖ రామన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.అయితే మాల్దీవుల్లో ఈమె స్విమ్ సూట్ వేసుకుని బీచ్ లో కూర్చుని ఉన్నటువంటి ఫోటోను తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన నెటిజన్లు విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నావు? అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే మరికొందరు మీకు వివాహం అయింది అయినా ఇలాంటి డ్రస్ ఏంటి? టూమచ్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Telugu Bikini-Movie

ఈ క్రమంలోనే విద్యుల్లేఖ ఈ పోస్ట్ పై స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్ చేశారు.ఈ ఫోటో షేర్ చేసినందుకు విడాకులు ఎప్పుడు? అంటూ కామెంట్లు వస్తున్నాయి జస్ట్ స్విమ్ సూట్ వేసుకున్నందుకే విడాకుల.1920 నుంచి బయటపడి 2021 లోకి రండి.సమస్య కామెంట్లలో కాదు మీ ఆలోచనలలో ఉందని తెలిపారు.

ఒకవేళ మహిళల దుస్తులే విడాకులకు కారణమైతే సరిగా దుస్తులు సరిగా ధరించిన వారు వారి వివాహ జీవితంలో సంతోషంగా గడపకూడదా అంటూ తనదైన శైలిలో స్పందించారు.సంజయ్ లాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం ఈ విధంగా వచ్చే కామెంట్ల గురించి ఆలోచించవద్దు అని నాకు చెప్పారు అయినప్పటికీ నేను వదలను ఇలా స్పందించడం వల్ల కొందరిలో అయినా మార్పు వస్తుందని భావిస్తున్నాను అంటూ ఈ పోస్ట్ పై స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube