బాలీవుడ్ లో నాకంటూ ఒక మార్కెట్ ఉంది అంటున్న విద్యాబాలన్  

Vidyabalan Share Her Remuneration, shakunthaladevi Movie, Bollywood, Amezon Prime, OTT Release - Telugu Amezon Prime, Bollywood, Ott Release, Shakunthaladevi Movie, Vidyabalan Share Her Remuneration

బాలీవుడ్ లో అసలు వివాదాల జోలికి వెళ్లకుండా వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి విద్యాబాలన్. ఆమె సినిమా తెరపైకి వచ్చే వరకు విద్యాబాలన్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుందా అని అందరికి డౌట్ వస్తుంది.

 Vidyabalan Share Her Remuneration

అంతలా బాలీవుడ్ లో పార్టీ కల్చర్ తో సంబంధం లేకుండా ఒక గృహిణిగా ఇంటి పట్టునే ఉంటుంది.అయినా కూడా విద్యాబాలన్ సినిమా రిలీజ్ కాబోతుంది అంటే మాత్రం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.

డర్టీ పిక్చర్ తో మొదలైన ఆమె లేడీ ఒరియాంటెడ్ కథల ప్రయాణం అప్రతిహితంగా కొనసాగుతుంది.గత 12 ఏళ్లలో ఆమె చేసిన సినిమాలు అన్ని కూడా లేడీ ఒరియాంటెడ్ సినిమాలే కావడం విశేషం.

బాలీవుడ్ లో నాకంటూ ఒక మార్కెట్ ఉంది అంటున్న విద్యాబాలన్-Movie-Telugu Tollywood Photo Image

వాటిలో చాలా వరకు హిట్ సినిమాలే ఉన్నాయి.తాజాగా గణితశాస్త్రవేత్త శాకుంతలాదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ఆమె టైటిల్ రోల్ పోషించింది.

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కి రెడీ అయ్యింది

ఈ సందర్భంగా ఆమె మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.రెగ్యులర్ కథలు చేసే ఆలోచన అస్సలు లేదని, కేవలం తనకి సరిపోయే కథలు మాత్రమే చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక పారితోషికం పరంగా కూడా ఎక్కువే తీసుకుంటానని మిగతా వాళ్ల విషయం తనకి తెలియదని, నావరకు నేను బాగానే తీసుకుంటానని చెప్పింది.గత 12 ఏళ్ల నుంచీ కేవలం మహిళా ప్రధాన చిత్రాలే చేస్తున్నాను.

దాంతో నాకంటూ ఇక్కడ ఓ మార్కెట్ కూడా ఏర్పడింది.దాంతో నా సినిమాలకు మార్కెట్ ఇబ్బంది వుండదు.

మార్కెట్టును బట్టే పారితోషికం కూడా ఇస్తారు.నా సినిమాలలో నేనే మెయిన్ లీడ్ చేస్తాను కాబట్టి అందరి కంటే ఎక్కువ పారితోషికం తీసుకునేది కూడా నేనే అని చెప్పింది.

నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు అయితే కోరుకుంటారో అలాంటి సినిమాలతోనే వారి ముందుకు రావడానికి ప్రయత్నిస్తా అని విద్యా ఇంటర్వ్యూలో తెలియజేసింది.

#Amezon Prime #OTT Release

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vidyabalan Share Her Remuneration Related Telugu News,Photos/Pics,Images..