సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపేవాళ్లు కాదు.మారుతున్న కాలంతో పాటే ప్రేక్షకుల అభిరుచి మారడంతో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతున్నాయి.
అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్టైతే హీరోయిన్లకు ఎంత మంచిపేరును తెచ్చిపెడుతున్నాయో సినిమా ఫ్లాప్ అయితే అదే స్థాయిలో చెడ్డపేరు మూటగట్టుకునేలా చేస్తున్నాయి.
తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినీ కెరీర్ లో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన విద్యాబాలన్ అలాంటి సినిమాలు ఎక్కువగా చేయడం తన వల్ల కాదని అన్నారు.ద డర్టీ ఫిక్చర్ సినిమాతో, నట్ఖట్ షార్ట్ ఫిలింతో విద్యాబాలన్ మంచి పేరుతో పాటు గుర్తింపును సంపాదించుకున్నారు.
ఆ సినిమాల వల్లే ఆమెకు గుర్తింపు సైతం దక్కింది.

అయితే మహిళల కష్టాలు, స్థితిగతుల గురించి చెప్పే కథలు తనకు నచ్చవని విద్యాబాలన్ అన్నారు.అయితే ఎవరైనా గొప్ప మహిళలు ఉంటే వారి జీవితాల నుంచి తయారైన కథల్లో మాత్రం తాను నటిస్తానని విద్యాబాలన్ చెప్పారు.తాను వ్యక్తిగతంగా సహజంగా ఉండే కథలను ఎక్కువగా ఇష్టపడతానని ఆమె పేర్కొన్నారు.
నవ్యత ఉన్న కథలను ఎంచుకుని భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలలో నటిస్తానని తెలిపారు.
అయితే విద్యాబాలన్ అభిమానులు మాత్రం ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాబాలన్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా మంచి పేరు రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే విద్యాబాలన్ నటించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.అభిమానుల మాటలను పరిగణనలోకి తీసుకుని విద్యాబాలన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాల్సి ఉంది.
.