మరో బయోపిక్ లో విద్యా.... మ్యాథ్స్ జీనియస్ శకుంతలగా  

Vidya Balan To Play Math Genius Shakuntala Devi In Her Next Film-math Genius Shakuntala Devi,vidya Balan Another Biopic,విద్యాబాలన్

ప్రముఖ నటి విద్యాబాలన్ మరో బయోపిక్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల బయోపిక్ ల హవా బాగా నడుస్తుంది. బాలీవుడ్ లో ఇటీవల విడుదల అయి విజయం సాధించిన సినిమాలు అన్నీ కూడా దాదాపు బయోపిక్ మూవీసే..

మరో బయోపిక్ లో విద్యా.... మ్యాథ్స్ జీనియస్ శకుంతలగా-Vidya Balan To Play Math Genius Shakuntala Devi In Her Next Film

అయితే ఈ బయోపిక్ ల హవా టాలీవుడ్ వరకు కూడా పాకింది అనుకోండి. ఈ నేపథ్యంలో ఇటీవల కధానాయకుడు,మహానాయకుడు పేరుతొ ఎన్ఠీఆర్ బయోపిక్స్ రిలీజ్ అవ్వగా, ఆ చిత్రంలో బసవతారకం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి విద్యాబాలన్ ఇప్పుడు మరో బయోపిక్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. మ్యాథ్స్ జీనియస్ శకుంతల దేవి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో విద్యా ప్రధాన పాత్ర పోషిస్తుందని సమాచారం.

అయితే విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకేక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

శకుంతల దేవి ఓ హ్యూమన్ కంప్యూటర్. ఐదు సంవత్సరాల వయస్సులో 18 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్ధుల మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సులువుగా సాల్వ్ చేసేవారు. ఇప్పుడు శకుంతల బయోపిక్ ను తెరకెక్కింది వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. మరోపక్క శకుంతల దేవి పాత్రలో నటించడం కోసం విద్యా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.

ఆమె ఒక బలమైన స్త్రీ. శకుంతల గారి ప్రతిభ ప్రపంచానికి తెలియాలన్నదే నా కోరిక అంటూ విద్యా వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ది డర్టీ పిక్చర్” లో తన అద్భుతమైన నటన తో అందరిని అలరించిన సంగతి తెలిసిందే.