తను బరువు పెరగడంతో జాతీయ సమస్యల మారిందంటున్న విద్యాబాలన్..!

ఇది వరకు కాలంలో హీరోయిన్లు అంటే సన్నగా నాజూగ్గా, దేవకన్యలాగా ఉండాలనీ అనుకునేవారు అన్ని రకాల సినీ ఇండస్ట్రీలలో.కానీ, కొంతమంది హీరోయిన్లు కేవలం అభినయం ఉంటే చాలు మిగతా అర్హతలు ఏవి అవసరం లేదని నిరూపించుకున్నారు.

 Vidya Balan Says Her Weight Gain Has Become A National Problem ,  Vidya Balan, W-TeluguStop.com

ఇందులో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ కూడా ఒకరు.ఈ బ్యూటీ చాలా బొద్దుగా ఉన్నా కూడా ప్రేక్షకులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

తన సినిమా ఇండస్ట్రీ మొదటిలో ఆమె బరువు గురించి చాలామంది కామెంట్ చేసిన కూడా ఆ తర్వాత ఆమె పోషించిన పాత్రలు నటించిన రీతి అందరికీ సమాధానం తెలియజేసింది.తన ఆరోగ్య సమస్యల కారణంగా బరువు భారీగా పెరిగిన విద్యాబాలన్ ప్రారంభంలో తన శరీరాన్ని ద్వేషించే దాన్ని అని, తాను ఎందుకు అంతలా లావు అవుతున్నానని బాధపడినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియచేసింది.

ఇంటర్వ్యూలో భాగంగా విద్యాబాలన్ మాట్లాడుతూ.” నా బరువు నాకు చాలా సార్లు అనేక సమస్యలను తెచ్చిపెట్టిందని చాలా కాలం వరకు నేను నా శరీరాన్ని అసహ్యించుకుంటున్నానని పేర్కొన్నారు.నా బరువు గురించి ఇతరుల మాట్లాడుతున్న సమయంలో నేను చాలా నిరాశకు గురి అయ్యానని తెలిపారు .అలాగే హార్మోన్ల సమస్య వల్ల ఈ బరువు సమస్య వచ్చినట్లు తెలిసింది.ఇక బరువు గురించి ఆలోచించకుండా, ఎలాంటి దిగులు చెందకుండా నా లక్ష్యం సాధన పై దృష్టి పెట్టడంతో ప్రేక్షకులను అక్కటుకోవడంలో విజయం సాధించాను అంటూ విద్యాబాలన్ తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube