40 ఏళ్ళ వయసులోనూ వన్నె తరగని అందంతో మెరుస్తున్న హీరోయిన్...  

Vidya Balan Poses For Dabboo Ratnani Calendar 2020 - Telugu Vidya Balan, Vidya Balan Latest News, Vidya Balan Movie News, Vidya Balan Photos News, Vidya Balan Photoshoot, Vidya Balan Poses For Calender

2011 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు మిలన్ లుత్రీయ దర్శకత్వం వహించిన   “ది డర్టీ పిక్చర్” అనే చిత్రం ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.అంతేగాక ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ కి ఈ చిత్రం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

Vidya Balan Poses For Dabboo Ratnani Calendar 2020

అంతేగాక ఈ చిత్రంలో నటించిన తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది ఈ అమ్మడు.అయితే ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ గ్లామర్ షో తక్కువగా చేస్తూ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

అయితే తాజాగా ప్రముఖ ఫోటోషూట్ సంస్థ అయినటువంటి డబ్బూ రత్నాని క్యాలెండర్ 2020 కోసం పలు ఊరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమ అందాలతో హాట్ హాట్ ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ క్యాలెండర్ కోసం హీరోయిన్ విద్యాబాలన్ కూడా ఫోజులు ఇచ్చింది.

అనంతరం ఈ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.అయితే కొంతమంది విద్యాబాలన్ అభిమానులు తన అందానికి ఫిదా అయ్యారు.

అలాగే 40 ఏళ్ల వయసు దాటినా తనది వన్నె తరగని అందమని ఇప్పటికీ పలువురు హీరోయిన్లకి దీటుగా పోటీ ఇస్తుందని పొగుడుతున్నారు.అయితే మరికొంతమంది మాత్రం పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి వయసులో ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం అవసరమా అంటూ కొంతమేర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం విద్యాబాలన్ ప్రస్తుతం “శకుంతలా దేవి” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి అను మీనన్ దర్శకత్వం  వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయినటువంటి సోనీ పిక్చర్స్ బ్యానర్ పై విక్రం మల్హోత్ర నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

తాజా వార్తలు