అప్పట్లో నాకు ఎవరూ ధైర్యాన్ని ఇవ్వలేదు : విద్యాబాలన్‌

భారతీయ సినీ నటి విద్యాబాలన్.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హిందీ, బెంగాలీ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.సినిమాల్లో తన పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంట‌ాయి అంతే కాకుండా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

 Vidya Balan On Her Over Weight Becoming National Issue ,  Vidya Balan, Bollywood-TeluguStop.com

2003 బెంగాలీ సినిమా ద్వారా సినీ ప్రవేశం చేయగా ఆ తర్వాత బాలీవుడ్ కు పరిచయమయ్యింది.తొలిసారి నటనలో మంచి పేరు తెచ్చుకున్న విద్య ఆ తర్వాత వరుస ఆఫర్ లతో అవకాశాలు సొంతం చేసుకుంది.అంతే కాకుండా కొన్ని సినిమాలలో అతిథి పాత్ర కూడా చేసింది.

అంతేకాకుండా పద్మశ్రీ పురస్కారం కూడా అందుకుంది.ఇక వెండితెర లోనే కాకుండా బుల్లితెరలో కూడా వాణిజ్య ప్రకటనలో, సీరియల్ లో కూడా నటించింది.

ఇదిలా ఉంటే తాను తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది విద్యాబాలన్.

Telugu Bollywood, Problem, Interview, Obese, Padma Sree, Vidya Balan-Movie

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.ఇక ఆమె తన కొన్ని విషయాలు చెబుతూ.తాను సినిమాయేతర కుటుంబం నుంచి వచ్చినందున తనకు కష్ట సమయంలో ధైర్యం చెప్పే వాళ్ళు లేకపోయారని తెలిపింది.

అంతే కాకుండా తన అధిక బరువు గురించి వస్తున్న వార్తలపై స్పందించగా.తను లావుగా ఉన్న సరే తన శరీరానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపింది.

తనకు హార్మోన్ల సమస్య ఉండడంవల్ల తను చాలా లావుగా ఉన్నానని చెప్పుకొచ్చింది.అలా ఉండటమే తనకు బాధకర విషయమని, మొదట్లో చాలా అసహనానికి గురయ్యేదానని దాని వల్ల మరింత చిరాకు పడేదానన్ని తెలిపింది.

ఇక ఆమె సినిమాయేతర కుటుంబం నుండి వచ్చినందున తన అధిక బరువు వల్ల కెరీర్ ముగిసిపోదని ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేక పోయారని చెప్పుకొచ్చింది.ఆ తర్వాత తనంతట తానే ధైర్యం చెప్పుకుంటూ తానే ఆస్వాదిస్తూ తన శరీరాన్ని ప్రేమించడం మొదలు పెట్టిందట.

ఇక తాను బతికి ఉండటానికి కారణం కూడా తన శరీరమేనట.అందుకని తన శరీరానికి కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని విషయాలు పంచుకుంది.

అంతేకాకుండా కెరీర్ ఆరంభంలో కూడా ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొంది విద్య.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube