ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య పాత్ర లో టాప్ హీరోయిన్, ఆమె ఎవరో తెలుసా...       2018-06-10   00:11:16  IST  Raghu V

ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా దర్శకులు క్రిష్ చేతిలోకి వచ్చింది.ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ గారి పాత్ర ఎలాగ ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బ‌స‌వ‌తారకం రోల్ ఎవ‌రు పోషిస్తారు? అన్న‌దానిపై స‌స్సెన్స్ కొన‌సాగుతోంది. .ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ బాల‌య్య ఎవ‌రికిస్తారు? అన్న దానిపై గ‌త నెల రోజులుగా ఒకటే చ‌ర్చ‌. తాజాగా ఆ రోల్ కు తెర‌ప‌డింది. విద్యాబాల‌న్ ను క్రిష్ ఎంపిక చేసిన‌ట్లు రైట‌ర్ల బృందం ద్వారా తెలిసింది. ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల నటి ఆమె ఒక్క‌ర్తేన‌ని భావించి క్రిష్ తుది నిర్ణ‌యం తీసుకుని విద్య‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. విద్య‌ను సంప్రదించి ఆ క్యారెక్ట‌ర్ గురించి చెప్ప‌గానే ఆమె కూడా వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని తెలుస్తుంది.

జాతీయ అవార్డ్ గెలుచుకున్న నటి

బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి , నేషనల్ అవార్డ్ ని కూడా సొంతం చేసుకుంది విద్యాబాలన్ ఆమె మంచి కథలను ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కహాని.. డర్టీపిక్చర్.. తుమ్హారీ సులు వంటి సినిమాలు ఆమె ప్రతిభకు అద్దం పడతాయి. బోల్డ్ పాత్ర‌ల్లోనూ త‌న మార్క్ చాటింది.

ఇంతక ముందే ఆమెకి తెలుగు సినీ పరిశ్రమ నుండి అవకాశాలు వచ్చాయి కానీ ఆమె ఆ రోల్స్ ఆమెకి సెట్ అవదు అని వదులుకుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కావ‌డం..క్రిష్ ఆమెని అడగడంతో బ‌స‌వ‌తార‌కం రోల్ కు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో బ‌స‌వ‌తార‌కం అత్యంత కీల‌క‌మైన వ్య‌క్తి. సినిమాలు-రాజ‌కీయాల్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న త‌న 13 మంది సంతానాన్ని ఎంతో నేర్పుగా పెంచుకుంటూ వ‌చ్చారు. ఎన్జీఆర్ విజ‌యాలు వెనుక ఆమె కీల‌క పాత్ర పోషించారు.ఆమె పాత్రని ఏవిధంగా చూపిస్తారో ఆ పాత్రకి విద్యాబాలన్ ఎంత న్యాయం చేస్తుందో వేచి చూడాలి..

విద్యాబాల‌న్ తొలి తెలుగు చిత్రం ఇదే. గ‌తంలో మాల‌యాళంలో `ఉరిమి` అనే సినిమాలో స్పెష‌ల్ రోల్ చేసింది. మ‌ళ్లీ ఇంత‌కాలానికి సౌత్ లో అదీ మ‌న తెలుగు సినిమాలో న‌టించ‌డం ఇదే. ఆమె ఎంట్రీతో ఎన్టీఆర్ బ‌యోపిక్ కు మ‌రింత క్రేజ్ సంత‌రించుకుంటుంది. ఇక మిగ‌తా పాత్ర‌ల‌ను ఎంపిక చేయ‌డం ఉంద‌ని…ఆ ప‌నులు కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతాయని యూనిట్ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ప్ర‌స్తుతం క్రిష్ బాలీవుడ్ లో మ‌ణిక‌ర్ణిక సినిమా తెర‌కెక్కిస్తున్నారు. వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మిబాయ్ జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు..