జాకెట్ పీస్ తో కరోనా మాస్క్ తయారు చేసిన స్టార్ హీరోయిన్... 

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినటువంటి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించినటువంటి విద్యాబాలన్ తన నటన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అంతేగాక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ విద్యాబాలన్ కి మాత్రం తెలుగు సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

 Vidya Balan, Bollywood Actress, Mask Making Video, Instagram,  Mission Man Gal,-TeluguStop.com

అయితే ఆ తరువాత ఈ అమ్మడు మళ్లీ తెలుగులో కొత్త సినిమాలను ఒప్పుకోలేదు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సినీ ప్రముఖులు తమదైన శైలిలో ముందుకు వస్తున్నారు.

ఇందులో భాగంగా కొందరు విరాళాల రూపంలో సాయం చేస్తుంటే మరికొందరు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సలహాలు సూచనలు ఇస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు.తాజాగా విద్యాబాలన్ కూడా మహిళలు ధరించే జాకెట్ పీస్ తో కరోనా వైరస్ రాకుండా ధరించినటువంటి మాస్కులను తయారు చేస్తూ ఓ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

విద్యాబాలన్ చేసినటువంటి ఈ ప్రతి పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అదునుగా చేసుకున్నటువంటి కొన్ని మెడికల్ కంపెనీలు అతి తక్కువ ధరకు దొరికేటువంటి మాస్కులను ధరలు పెంచి అమ్ముతున్నారని అందువల్ల ఇంటి పట్టునే ఇలాంటి మాస్కులు తయారు చేసుకునే విధానం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విద్యాబాలన్ బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు అను మీనన్ దర్శకత్వం వహిస్తున్న”శకుంతలా దేవి” అనే చిత్రంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ “సోనీ పిక్చర్స్” నిర్మిస్తోంది.

అలాగే “షేరిని” అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది.గతంలో ఈమె నటించిన “మిషన్ మంగళ్” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube