మాయావతిగా మారుతున్న విద్యాబాలన్! బాలీవుడ్ లో సంచలనం  

వరుస బయోపిక్ తో బిజీ అయిపోతున్న విద్యా బాలన్. అందరూ రాజకీయ మహిళా అధినేతలే. .

Vidya Balan Become Main Role In Mayavathi Biopic-bsp,congress,jolly Llb Director,main Role In Mayavathi Biopic,vidya Balan

బాలీవుడ్ లో స్టార్ కతానాయికలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి విద్యాబాలన్. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ తో విద్యా ఇమేజ్ ఆకాశానికి వెళ్ళిపోయింది. దీంతో ఆమె తన సినిమాలో బెస్ట్ ఛాయస్ ని సెలెక్ట్ చేసుకుంటూ వరుస సక్సెస్ లు అందుకుంటుంది..

మాయావతిగా మారుతున్న విద్యాబాలన్! బాలీవుడ్ లో సంచలనం-Vidya Balan Become Main Role In Mayavathi Biopic

రెగ్యులర్ హీరోయిన్స్ కి భిన్నమైన కథలతో బాలీవుడ్ లో విద్యా సత్తా చూపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ భామ ఈ మధ్య వరుస బయోపిక్ చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది.

తెలుగులో ఎన్టీఆర్ సినిమాలో బసవతారకం పాత్రలో మెరిసిన విద్యా మరో వైపు తమిళంలో జయలలిత బయోపిక్ లో కనిపించబోతుంది.

అలాగే హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఇందిరాగాంధీ బయోపిక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుసగా రాజకీయ నాయకురాల్ల పాత్రలతో బిజీ అవుతున్న విద్యా బాలన్ తాజాగా మరో సంచలన చిత్రంలో నటించడానికి ఒకే చెప్పింది.

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి పాత్రలో త్వరలో ఆమె కనిపించబోతుంది. జాలీ ఎల్.

ఎల్.బి ఫేం సుభాష్ కపూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్టొరీ సిట్టింగ్ లో విద్యా పాల్గొని మాయావతి పాత్రని చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది..

బహుజన్ సమాజ్ వాది నాయకురాలిగా, కాన్సిరాం శిష్యురాలుగా రాజకీయాలలో మాయావతి తనదైన ముద్ర వేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంది. మాయావతి జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత్రని వెండితెరపై విద్యాబాలన్ రూపంలో కనిపించానుండటం సంచలనంగా మారింది.