చిరుకు సోదరిగా బాలీవుడ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Vidya Balan As Chiranjeevi Sister, Vidya Balan, Chiranjeevi, Lucifer, Tollywood-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ కాకముందే చిరు తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ను అనౌన్స్ చేసిన మెగాస్టార్, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ విద్యా బాలన్ నటించబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.లూసిఫర్ చిత్రంలో హీరో పాత్రను చిన్నతనం నుండి ద్వేషిస్తూ చివర్లో ఆయన సహాయం కోరే పాత్రలో ఓ స్టార్ బ్యూటీ నటిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే ఈ పాత్ర చిరంజీవికి సోదరిగా ఉండబోతుందని, ఆ విషయం సినిమా క్లైమాక్స్‌లో రివీల్ అవుతుందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ అయితే ఈ ఎమోషనల్ పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ అనుకుంటోంది.

ఇక ఈ పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

దీంతో మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో విద్యా బాలన్ ఎలా కనిపిస్తుందా అనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్రా నెలకొంది.

ఇక గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో విద్యాబాలన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.మరి లూసిఫర్ రీమేక్‌లో విద్యా బాలన్ నిజంగానే నటిస్తుందా లేదా అనే ఆతృత ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.

ఇక ఈ సినిమాకు ‘రారాజు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది.ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube