బాబోయ్.. ఆ ఫేమస్ కమెడియన్ ఇంత స్లిమ్ గా మారిపోయిందా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటిగా ఎంతో గుర్తింపు సంపాదించి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది నటి విద్యుల్లేఖ రామన్.కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అటు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 Comedian Vidhyullekha Raman, Vidhyullekha Turns Slim, Vidhyullekha Slim Body-TeluguStop.com

అయితే ఎప్పుడు బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ… ప్రస్తుతం మాత్రం ఫిట్నెస్ పై బాగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.అయితే ఈ మధ్య కాలంలో కేవలం హీరోయిన్లు మాత్రమే ఫిట్నెస్ పై దృష్టి పెట్టడం చూశాం.

కానీ తాజాగా హాస్య నటి విద్యుల్లేఖ కూడా ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ఎంతగానో సన్న బడిపోయింది.తాజాగా విద్యుల్లేఖ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో జిమ్లో వర్కవుట్ చేసి స్లిమ్ గా మారిన ఒక ఫోటోని షేర్ చేసింది.

ప్రస్తుతం అది నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.ఈ ఫోటోలు విద్యుల్లేఖ ఎంతో సన్నగా మారిపోయింది.కాగా తాను ఇలా మారిపోవడానికి వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది అంటూ విద్యుల్లేఖ చెప్పుకొచ్చింది.

బాబోయ్ ఆ ఫేమస్  కమెడియన్ ఇంత స

అయితే అధిక బరువు ఉన్నప్పుడు తనకు నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అని ఒక ప్రశ్న ఎదురయ్యేది అని… కానీ ప్రస్తుతం బరువు తగ్గిన తర్వాత చూసుకుంటే మాత్రం నిజంగా అప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నానా అని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ.అయితే ఇలా సన్నబడటం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉందని.తన లైఫ్ స్టైల్ తో పాటు తన ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మార్చుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చింది.

జీవితంలో ఏదీ ఈజీగా రాదని కష్టపడాల్సిందే అంటూ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube