అమీర్ ఖాన్ పీకే సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత- Vidhu Vinod Chopra Confirms Pk Sequel With Ranbir Kapoor

Vidhu Vinod Chopra confirms PK sequel with Ranbir Kapoor, Bollywood, Indian Cinema, Aamir Khanm Anushka Sharma - Telugu Aamir Khanm Anushka Sharma, Bollywood, Indian Cinema, Pk Sequel, Ranbir Kapoor, Vidhu Vinod Chopra

అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా పీకే.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

 Vidhu Vinod Chopra Confirms Pk Sequel With Ranbir Kapoor-TeluguStop.com

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ గ్రహాంతర వాసిగా కనిపిస్తాడు.వేరొక గ్రహం నుంచి భూమి మీదకి వచ్చి తన అమాయకత్వంతో విపరీతమైన ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.

అదే సమయంలో ప్రస్తుతం సమాజంలో ఉన్న హిందూ ఆచారాలు, ప్రజల మూడ విశ్వాసాలని వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ ఉంటాడు.అలాగే స్వామీజీలు, తాయెత్తులు అంటూ గుడుల చుట్టూ తిరిగే ప్రజల నమ్మకాలని కూడా హేళన చేస్తూ కథనం నడిపిస్తారు.

 Vidhu Vinod Chopra Confirms Pk Sequel With Ranbir Kapoor-అమీర్ ఖాన్ పీకే సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకి హిందుత్వ సంఘాల నుంచి కొంత వ్యతిరేకత వచ్చిన కూడా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.ఇందులో చర్చించిన ప్రతి అంశం ఆలోచింపజేసే విధంగా ఉండటంతో దీనిపై ఎక్కువ వివాదం చేయలేకపోయారు.

ఇక ప్రముఖ నిర్మాత విదు వినోద్ చోప్రా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.అయితే రిలీజ్ తర్వాత అంతకు రెట్టింపు ఆదాయం సినిమా కలెక్షన్స్ తో వచ్చింది.

పీకే క్లైమాక్స్ లో మరో గ్రహాంతర వాసిగా రణబీర్ కపూర్ ని దర్శకుడు చూపించి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చాడు.ఈ నేపధ్యంలో అప్పటి నుంచి పీకే సీక్వెల్ పై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని నిర్మాతని మీడియా ప్రతినిధులు అడిగారు.ఈ సందర్భంగా వినోద్ చోప్రా మాట్లాడుతూ పీకేకి సీక్వెల్ చేస్తున్నాం.ఫైనల్ గా రణబీర్ కపూర్ ని చూపించాం కాబట్టి కథ ఇంకా చెప్పడానికి అవకాశం ఉంది.రైటర్ కథ ఇంకా రాయలేదు.

రాసిన తర్వాత దీనిపై ఒక స్పష్టత ఇస్తామని తెలిపారు.

#AamirKhanm #Ranbir Kapoor #PK Sequel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు