రక్తపోటు ఉందా అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే!  

Video Selfie May Measure Blood Pressure-

రక్త పోటు ఉన్నవారికి శుభవార్త అని చెప్పాలి.ఎందుకంటే ఈ రక్త పోటు ఎప్పుడు పెరుగుతుందో,ఎప్పుడు తగ్గుతుందో అన్న విషయం చెప్పలేం.దీనితో రక్త పోటు ఉన్నవారు నెలనెలా ఆసుపత్రికి వెళ్లి బీపీ చెకప్ చేయించుకొని రావడం ఒక పెద్ద టాస్క్ లా మారిపోతుంది.

Video Selfie May Measure Blood Pressure--Video Selfie May Measure Blood Pressure-

దీనితో ఒకనెల కుదిరి,మరోనెల కుదరక ఈ రక్త పోటు ఉన్నవారు తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే ఇక ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమి లేదు.కేవలం ఒకే ఒక్క సెల్ఫీ తో మీ శరీరంలో రక్త పోటు ఎంత ఉంది అన్న విషయం ఇట్టే తెలుసుకోవచ్చు.

Video Selfie May Measure Blood Pressure--Video Selfie May Measure Blood Pressure-

టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్త కాంగ్ లీ సరికొత్తగా వీడియో సెల్ఫీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.ఇందులో చర్మం లోపలి చిత్రాలు తీయగల సాఫ్ట్ వేర్ ఉంది.ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి తాము ముందుగా కొంతమంది ముఖాల వీడియోలు తీశామని.

రెండు నిమిషాల ఈ వీడియోల ద్వారా సేకరించిన బీపీ వివరాలకు బీపీ మెషిన్ ద్వారా సేకరించిన వివరాలను సరిపోల్చి ఈ సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేశామని వివరించారు.

ఈ పద్ధతి ద్వారా వచ్చే వివరాలు దాదాపు 95 శాతం ఖచితత్వం ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తెలిసిందని కాంగ్ లీ వెల్లడించారు.

మరికొన్ని పరిశోధనలు జరిపి త్వరలో అర నిమిషం వీడియో సెల్ఫీతో బీపీ చెక్ చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు.ఇక మొత్తానికి బీపీ చూపించుకోవడానికి ఇక నెలనెలా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు అన్నమాట.