ప్రపంచంలో అన్ని రంగాల్లో క్రియేటివ్ పీపుల్స్ ఉన్నారు.ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ప్రజలను ఆకట్టుకునేందుకు చాలా క్రియేటివ్‌గా ఆలోచించి ఓనర్లు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తుంటారు.
విమానం లాంటి సెటప్‌తో రెస్టారెంట్స్ కట్టిన వారు కూడా ఉన్నారు.కొందరు ఫ్లోర్ కింద బతికున్న చేపలను ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు.
అయితే తాజాగా ఇలాంటి క్రియేటివ్ కేఫ్( Creative Cafe ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కేఫ్ ఇంటీరియర్, ఫర్నిచర్, ప్రతిదీ ఒక స్టోరీ బుక్ లో కనిపించే డ్రాయింగ్ లాగా మార్చేశారు.
@MeteoBarrufet ట్విట్టర్ పేజీ ఈ కేఫ్ కి సంబంధించిన వీడియో షేర్ చేసింది.
దక్షిణ కొరియాలోని ప్రముఖ నగరమైన సియోల్‌లో కేఫ్ యోన్నమ్-డాంగ్ 239-20( Cafe Yeonnam-dong 239-20 in Seoul ) అనే మ్యాజికల్ ప్లేస్ ఉంది.ఇది బ్లాక్ అండ్ వైట్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని ఆహ్వానించే హాయిగా ఉండే స్వర్గధామం, ఇక్కడ ప్రతిదీ స్టోరీ బుక్ లోని డ్రాయింగ్ లాగా కనిపిస్తుంది.గోడలు చేతితో గీసిన చిత్రాలతో నిండి ఉంటాయి, ఫర్నిచర్ కూడా సేమ్ మనం స్టోరీ బుక్ లో ఎలాంటివి చూస్తామో అలాంటివే ఇక్కడ ఉంటాయి.
ఈ కేఫ్ వాతావరణం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.
ఈ సెట్టింగ్ మంత్రముగ్ధల్ని చేస్తుందని అనడంలో సందేహం లేదు.ఇలాంటి ఒక ప్లేస్ లో కూర్చొని రుచికరమైన కప్పు కాఫీ( cup of coffee ) లేదా స్వీట్ తింటుంటే వచ్చే అనుభూతే వేరు.ముఖ్యంగా లవర్స్ లేదా భార్యాభర్తలు వెళ్లడానికి ఇది బెస్ట్ ప్లేస్ అవుతుంది.
కేఫ్ Yeonnam-dong 239-20 కేవలం ఒక కేఫ్ మాత్రమే కాదు ఇది అంతులేని ఊహల ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది.మరపురాని జ్ఞాపకాలను ఏర్పరుస్తుందనడంలో సందేహం లేదు.ఈ వీడియో చూసినవారు అక్కడ ఒక్క కప్పు కాఫీ అయినా తాగాలని తమ కోరికను వ్యక్తపరిచారు.దీనిని మీరు కూడా చూసేయండి.