వీడియో: ఏంది సామీ ఇది.. అది మొసలి అనుకుంటివా లేక కుక్కపిల్ల అనుకుంటివా..

సాధారణంగా ప్రజలు తమ ఇంట్లో పిల్లి లేదా కుక్క లేదా చేప వంటి హాని చేయని జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.చిలుక లేదా తాబేలు వంటి పెంపుడు జంతువులను కూడా పెంచుకునేవారు ఉన్నారు.

 Video  What's This Sammy  Is It A Crocodile Or A Puppy , Crocodile, Viral Latest-TeluguStop.com

అయితే ఒక మొసలిని పెంపుడు జంతువుగా ఎవరైనా పెంచుతారా? దానిని ఏదో కుక్కపిల్ల లాగా తలపై నిమురుతూ ఆహారం అందించగలరా? అని ప్రశ్నిస్తే కాదని చెప్పవచ్చు.ఎందుకంటే ఇవి అత్యంత ప్రమాదకరమైన జంతువులు.

వీటిని కుక్కలలాగా ట్రీట్ చేస్తే మనల్ని అవి వేటాడుతాయి.ఎంతైనా క్రూర ఉభయచరాలు కాబట్టి వీటిని దూరంగానే ఉంచాలి.

కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక మొసలిని పెంచుతూ దానిని ఒక కుక్కపిల్ల లాగా ఎత్తుకుంటున్నాడు.అంతేకాదు, తన ఒట్టి చేతులతో మొసలి నోటికి ఆహారం అందిస్తున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

బ్రో, అది మొసలి అనుకుంటివా లేక కుక్కపిల్ల అనుకుంటివా?? దాంతో అలా ఆడుకుంటున్నావ్ ఏంటి అని అంటూ నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో ఒక సరస్సులోని ఒక పడవ అంచున ఒక యువకుడు కూర్చుని ఉండటం చూడవచ్చు.

ఆ తర్వాత అతడు మొసలిని తన వద్దకు పిలుస్తాడు.ఆ జీవి అతడు పిలవగానే చాలా వినయంగా అతని వద్దకు వస్తుంది.అనంతరం ఆ వ్యక్తి తన పాదాలతో ఆ మొసలిని పైకి లేపుతాడు.ఒట్టి చేతితో ఆహారాన్ని అందిస్తాడు.

ఆ తర్వాత మొసలి తలపై తడుముతాడు.అలా నిమిరించుకున్న తరువాత ఆ మొసలి తిరిగి మళ్లీ సరస్సులోకి వెళ్ళిపోతుంది.

మనం మన పెంపుడు జంతువులను ఎలా దగ్గరికి తీసుకుని ముద్దాడుతామో ఆ విధంగా అతడు క్రూరమైన మొసలిని దగ్గరికి తీసుకొని ముద్దాడాడు.ఈ వీడియోను ద ఫిగ్జెన్ అనే ట్విట్టర్‌ యూజర్ షేర్ చేశారు.

ఈ వీడియోకి 47 లక్షలకు పైగా వ్యూస్, 32 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube