వీడియో వైరల్: క్షణాల్లో ప్రాణాన్ని కాపాడిన రియల్ హీరో..!

ఓ నిండు ప్రాణాన్ని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు జోసెఫ్ రీన్ హార్ట్ అనే వ్యక్తి.రెస్టారెంటులో పనిచేస్తున్న జోసెఫ్ సమయానికి స్పందించి ఓ ప్రాణాన్ని నిలబెట్టాడు.

 Video Viral Real Hero Saved Life In Fraction Of Seconds In America Details,  Rea-TeluguStop.com

ఒక రెస్టారెంట్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి ఫుటేజీలో రికార్డయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని యూట్యూబ్ ఛానల్ వైరల్ హగ్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ గా మారింది.

అమెరికాలోని విస్కాన్సిన్ లో జోసెఫ్ రీన్ హార్ట్ స్థానిక రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు.అయితే అక్కడికి వచ్చిన ఒక టీనేజర్ రెస్టారెంట్ లో చికెన్ శాండ్విచ్ తింటుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది.

దీంతో అతడు ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డాడు.అయితే దీన్ని గమనించిన జోసెఫ్ రీన్ హార్ట్ వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడేందుకు తన సాయశక్తులా ప్రయత్నించాడు.

చివరికి ఆ అబ్బాయి ప్రాణాలను కాపాడాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ వీడియోని పోస్ట్ చేసిన పేజీ అడ్మిన్ ఈ వీడియోకు ఒక కాప్షన్ జత చేస్తూ ఇలా రాసాడు.

జోసెఫ్ రీన్ హార్ట్ అనే వ్యక్తి స్థానిక బార్ అండ్ రెస్టారెంట్ లో ఒక టీనేజర్ ప్రాణాన్ని కాపాడాడు.ఓ అబ్బాయి చికెన్ శాండ్విచ్ తింటున్న క్రమంలో చికెన్ ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయింది.ఇక్కడ వీడియోలో గాబరాగా కనిపిస్తున్న మహిళా ఆ యువకుడి తల్లి.

వీడియోలో ఉన్న మరో మహిళ ఎమర్జెన్సీ కి కాల్ చేసింది.అదృష్టవశాత్తు ఆ అబ్బాయి ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు’ అని ఉంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు వెంటనే స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన జోసెఫ్ రీన్ హార్ట్ ను నెటిజన్లు హీరోగా అభివర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube