వీడియో వైరల్: రెప్పపాటు క్షణంలో మనిషి ప్రాణం కాపాడిన జవాన్..!

రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి.చాలా మంది పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించరు.

 Video Viral Jawan Who Saved A Man's Life In The Blink Of An Eye, Rail, Javan, Sa-TeluguStop.com

మరికొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు.ఈ క్రమంలో కిందపడిపోతారు.

అలాగే ట్రైన్ నడుస్తున్నప్పుడు సడెన్ గా దిగుతారు.ఇలాంటివి చేయొద్దంటూ.

రైల్వే అధికారులు ఎన్నిసార్లు చెప్పినా.అవేమీ లెక్కచేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.రైల్వే అధికారులు దీనికి సంబంధించిన వీడియోని ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మహారాష్ట్ర లోని వాసాయి రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు వేగంగా వెళ్తున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించి ప్లాట్ ఫామ్, ట్రైన్ కు మధ్యలో కిందపడిపోయాడు.కొన్ని సెకన్ల పాటు ఆ ప్రయాణికుడు అలానే ట్రైన్ ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో ఉండిపోయాడు.

దీనిని గమనించిన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ జవాన్ వేగంగా వచ్చి.కిందపడిపోయిన ప్రయాణికుడిని ప్లాట్ ఫామ్ మీదకు లాగేశాడు.

రెప్పపాటి కాలంలోనే బాధిత ప్రయాణికుడిని ప్లాట్ ఫామ్ మీదకు లాగి అతని ప్రాణాలు కాపాడాడు.దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ఈ వీడియో సోషల్ మీడియాలో తగ వైరల్ అయింది.

ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ జవాన్ కి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.రియల్ హీరో అంటే మీరే.

అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా… మీ ధైర్య, సాహసాలకు సెల్యూట్ సార్ అంటూ మరికొందరు కామెంట్ పెడుతున్నారు.కాగా, కొద్ది రోజుల క్రితం కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలును దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జారిపడిన గర్భిణీ స్త్రీని రైల్వే సిబ్బంది కాపాడారు.

అంతేకాక, కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్‎లో కదులుతున్న రైలు ఎక్కబోయి రైలు కింద పడబోయాడు.రైల్ లోని ప్రయాణికులు చైన్ లాగడంతో ట్రైన్ ఆగిపోయింది.

అతడిని పాయింట్స్ మ్యాన్ వెంటనే పైకి లాగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube