వీడియో వైరల్: కఠిన క్వారెంటైన్ లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు..!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప‌రిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం.సెకండ్ వేవ్‌లో అయితే ప‌రిస్థితులు చాలా దారుణంగా త‌యార‌య్యాయి.

 Video Viral Indian Cricket Team Players Entered The Quarantine Before Wtc Final-TeluguStop.com

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే అన్ని దేశాలు క‌ఠిన నియ‌మ‌, నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి.ఇత‌ర దేశాల్లో నుంచి వ‌చ్చిన వారికి క్వారంటైన్ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేశాయి.

ఈ క్ర‌మంలో మ‌న ఇండియా క్రికెట్ టీమ్ ఇంగ్లండ్‌కు వెళ్లిన సంగ‌తి తెల‌సిందే.

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో స‌త్తా చాటేందుకు టీమిండియా మొన్న‌నే ఇంగ్లండ్ చేరుకుంది.

సౌతాంప్ట‌న్‌లోని ఏజియ‌స్ బౌల్ స్టేడియంలో ఇప్పుడు మ‌న ఇండియ‌న్ క్రికెట‌ర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది.అయితే ఇందుకోసం ఇండియా నుంచి వెళ్లిన వారు అక్క‌డ మూడు రోజులు క‌ఠిన్ క్వారెంటైన్‌లో ఉండ‌నున్నారు.

మ‌న భారత క్రికెటర్లు కనీసం ఒకరిని ఒకరు కూడా చూసుకునేందుకు వీలు లేకుండా సెప‌రేటు రూముల్లో ఉండాల‌ని అక్క‌డి అధికారులు ఆదేశించిన‌ట్టు భారత స్పిన్నర్ అక్సర్ పటేల్ తెలిపాడు.

ఇక అంద‌రూ ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ జూన్ 18న స్టార్ట్ అవుతుంది.

ఇక్కడకు రావడానికి భారతదేశానికి చాలా త‌క్కువ కాలం ఉంది.మరోవైపు, న్యూజిలాండ్ ఇప్పటికే ఇంగ్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడేందుకు రెడీ అవుతోంది.ఇక ఇండియా క్రికెట‌ర్లు స్క్వాడ్ బయలుదేరే ముందు ముంబైలో 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నార‌ని తెలిసిందే.ముంబై నుంచి సౌతాంప్ట‌న్ బయల్దేరిన విమానంలో పురుషులతో పాటు మ‌హిళ‌ల జ‌ట్టు క్రికెట‌ర్లు ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

ఇక వీరంతా క‌లిసి వెళ్తున్న స‌మ‌యంలో తీసిన ఇంట‌ర్వ్యూ వీడియోను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

ఇది కాస్తా వైర‌ల్ గా మారింది.జూన్ 18న న్యూజిలాండ్‌తో జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇక మ‌న ఇండియా టీమ్ లండన్‌లో దిగిన తరువాత, సౌతాంప్టన్‌కు రెండు గంటల బస్సు ప్రయాణం చేసింద‌ని బీసీసీఐ వెల్ల‌డించింది.

మహిళల జట్టు జూన్ 16 నుంచి సొంత జట్టుతో వన్ ఆఫ్ టెస్ట్, మూడు వన్డేలు, సొంత టీ20 ఇంటర్నేషనల్స్ ఆడేందుకు రెడీ అవుతున్నార‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube