వీడియో వైరల్: జుట్టుకు జిగురును రాస్తే.. చివరకు..?!

జుట్టు ఒత్తుగా ఉండాలని, స్టైలిష్ గా ఉండాలని, తమకి నచ్చిన ఆకారాల్లో జుట్టు చాలా రోజుల వరకు అలాగే ఉండి పోవాలని చాలా మంది ప్రజలు రకరకాల హెయిర్ స్ప్రేలను వాడుతుంటారు.వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ సుదీర్ఘ కాలం లో మాత్రమే ఆ దుష్ఫలితాలు బయటపడతాయి.

 Viral Vido Tessica Brown Tiktok User Applied Gorilla Glue To Hair, Video Viral,-TeluguStop.com

అయితే కొందరు తమ హెయిర్ తో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.కంటికి కనిపించిన ప్రతి ఒక్కటి తమ జట్టుపై ప్రయోగించే ఆడవారు చాలామంది ఉన్నారు.

సోషల్ మీడియాలో పాపులర్ కావాలని కొందరు తెలివి తక్కువ ప్రయోగాలు చేసి అనేక ఇబ్బందులు పడుతుంటారు.లూసియానా కి చెందినటెస్సికా బ్రౌన్ అనే టిక్ టాక్ యూజర్ కూడా ఒక తెలివితక్కువ పని చేసి ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఎమర్జెన్సీ వార్డ్ లో చికిత్స పొందుతోంది.

ఇంతకీ ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే.తాను రెగ్యులర్ గా వాడే Göt2b Glued Spray అయిపోయిందని తన ఇంట్లో ఉన్న గొరిల్లా గ్లూ ని జుట్టుకి అప్లై చేసుకుంది.

అలాగే ఆ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.నిజానికి ఈ గొరిల్లా గ్లూ విరిగిపోయిన వస్తువులను ఒకటిగా అతుకు పెట్టేందుకు ఉపయోగిస్తారు.ప్రపంచంలోనే నెంబర్ వన్ బంక గా పేరొందిన ఈ గొరిల్లా గ్లూ లో చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి.ఈ బంక లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలని గొరిల్లా గ్లూ సంస్థ ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది.

కానీ టెస్సికా బ్రౌన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన తలపై చాలా గమ్ము పోసుకుంది.దీంతో క్షణాల్లోనే ఆమె జుట్టు అంతా తలచుట్టూ గట్టిగా అతుక్కుపోయింది.

దీంతో బాగా కంగారు పడిపోయిన ఆమె వెంటనే షాంపూతో పదిహేను సార్లు తలస్నానం చేసింది.కానీ తన జట్టు కి అంటుకున్న బంక మాత్రం వదలలేదు.

దీంతో ఈ విషయాన్ని టిక్ టాక్ వేదికగా తెలుపుతూ.తాను పెద్ద తప్పు చేశానని.ఎవరు కూడా గొరిల్లా గ్లూ జోలికి అస్సలు వెళ్లొద్దని చెప్పుకొచ్చింది.అలాగే తాను ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నానని వెల్లడించింది.జట్టు తలకు గట్టిగా అతుక్కుపోవడం వల్ల ఆమెకు విపరీతంగా తలనొప్పి వస్తుందట.అయితే ఆమె అప్లోడ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో గొరిల్లా గ్లూ సంస్థ స్పందించింది.

ఆల్కహాల్ తో తలపై పలుసార్లు రుద్దితే గమ్ము తొలగిపోతుందని చెప్పింది.కానీ అదికూడా వర్కౌట్ కాలేదు.

ఒకవేళ బంక పోయినప్పటికీ జట్టు రూట్స్ శాశ్వతంగా పాడవుతాయని.ఇకపై జుట్టు కూడా పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని పలువురు అంటున్నారు.

ఏది ఏమైనా జిగురు ఆమె తల జుట్టు నుంచి పోవాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube