వీడియో వైరల్: చెట్టు పైనుండే నక్కని వేటాడిన కొండచిలువ.. చివరకు..?!

పాముల్లో అతి పొడవైన పాములుగా పేరొందిన కొండచిలువలు ఎంత పెద్ద జంతువునైనా నిమిషాల వ్యవధిలో చంపగలవు.ఇవి మనుషులకు కూడా గట్టిగా చుట్టుకొని వారి ప్రాణాలను తీసేయగలవు.

 Video Viral: A Python Hunting A Fox From A Tree   Finally  Viral Video,python, H-TeluguStop.com

ఇప్పటికే చాలామంది మనుషులు కొండచిలువలకు ఆహారం అయ్యారు.కొండచిలువలు ఇతర జీవులను వేటాడే దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి.

ఇతర జీవులను గట్టిగా చుట్టేసి బొక్కలు మొత్తం విరిచేస్తూ ప్రాణాలు తీసే భయంకరమైన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి.అయితే తాజాగా కొండచిలువ దాడికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కూడా చాలా భయంకరంగా, హృదయ విదారకంగా ఉన్నాయి.

ఈ వీడియోలో ఓ చెట్టుపై కెక్కిన నక్కను భారీ కొండచిలువ చుట్టేసినట్లు కనిపించింది.

పాపం, ఆ నక్క అప్పటికే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.తరువాత కొండచిలువ మరింత ఒత్తిడి తో నక్క ఎదురు రొమ్ము భాగాన్ని గట్టిగా చుట్టేసింది.

దీంతో నక్క శరీరంలోని బొక్కలు విరిగి గుండె కొట్టుకోవడం స్థంభించిపోయింది.చూస్తుండగానే కొండచిలువ పట్టులో నక్క ప్రాణాలు విడిచింది.

అయితే నక్కను అత్యంత దారుణంగా చంపేసిన ఈ క్రూరమైన కొండచిలువ దానిని మింగడానికి ప్రయత్నించింది.చెట్టు పైనుంచి నక్క భౌతిక కాయాన్ని తన నోట్లోకి అమాంతం దూర్చడానికి యత్నించింది కానీ అది సాధ్యపడలేదు.

దీంతో సగం నక్క దాని నోట్లో ఉండిపోగా.అది చెట్టు పైనుంచి కిందకు వేలాడుతూ చాలా భయంకరంగా కనిపించింది.

దీనితో వీడియో ముగిసింది.

అయితే ఈ వీడియోపై చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఘోరమైన దృశ్యాలు గుండె పగిలేలా చేస్తున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఇది ప్రకృతి ధర్మం.

ఇందులో తప్పేమీ లేదని కామెంట్ చేస్తున్నారు. కొండచిలువ నక్కను నెమ్మదిగా మింగేసి హాయిగా భుజించి ఉంటుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోని ది డార్క్ సైడ్ ఆఫ్ నేచర్ పేజీ ట్విట్టర్ లో షేర్ చేయగా.ఇప్పటికే దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చాయి.

సుమారు 2500 లైకులు వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube