వీడియో వైరల్: మహిళ గర్భాన్ని ముద్దు పెట్టుకున్న కోతి పిల్ల.. దాంతో ఆ మహిళ..?!

జంతువులకు మాటలు రావు కానీ అవి కూడా మనిషి లాగానే ప్రేమ, ఆప్యాయత, కోపం ఇలా ఫీలింగ్స్ కలిగి ఉంటాయి.ఇక కోతులు అచ్చం మనిషి లాగానే వ్యవహరిస్తూ ఉంటాయి.

 Video Viral A Monkey Kissed The Baby Bump Of A Pregnant Woman, Viral Latest, Vir-TeluguStop.com

మానవుల లాగానే అవి తమ పిల్లలను ముద్దాడుతుంటాయి.అయితే వాటి పిల్లలనే కాదు కుక్క పిల్లి ఇలా ఏ జంతువు పిల్లలైనా అవి అక్కున చేర్చుకుంటారు.

అయితే తాజాగా ఒక కోతి మాత్రం ఒక మహిళ గర్భంలో ఉన్న శిశువు ని ముద్దాడుతూ కనిపించింది.దీంతో సదరు గర్భిణీ కోతి తన బిడ్డ పై చూపిస్తున్న ప్రేమకు పరవశించిపోయింది.

వివరాల్లోకి వెళితే.ఇంగ్లాండ్‌ దేశంలోని గ్లౌసెస్టర్‌కి చెందిన నవోమి డేవిస్, బెన్ బిల్లింగ్‌హామ్ అనే దంపతులు సమీపంలో ఉన్న జూకు వెళ్లారు.ఆ సమయంలో నవోమి గర్భిణీ.అయితే ఆమె జూలో సరదాగా తిరుగుతుండగా.

అక్కడి కోతులు ఆమె వైపు తీక్షణంగా చూడటం ప్రారంభించాయి.అయితే మనుషులకు కోతులకు మధ్య ఒక గ్లాస్ అమర్చారు.

ఈ క్రమంలోనే ఓ పెద్ద కోతి గర్భిణీ ని దగ్గరికి రమ్మంటూ పిలిచింది.దాంతో ఆశ్చర్యపోయిన సదరు గర్భవతి గ్లాస్ కి దగ్గరగా వెళ్ళింది.

అప్పుడు ఆ పెద్ద కోతి తన పిల్లలతో కలిసి అర్థం వద్దకు వచ్చింది.ఇంతలో ఒక చిన్న పిల్ల కోతి గర్భవతి బేబీ బంప్ పై పదేపదే ముద్దులు పెడుతూ ఆశ్చర్యపరిచింది.

అయితే మధ్యలో గ్లాస్ ఉండటంతో ఆ గ్లాస్ పైనే గర్భవతి కడుపులోని బిడ్డను ముద్దాడుతూ కోతి విపరీతమైన ప్రేమ కురిపించింది.దాంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అలాగే ఆమె ఈ వీడియోని నెట్టింట షేర్ చేసి తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

నెటిజన్లు కూడా ఇటువంటి కోతి ప్రేమను తామేప్పుడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube