వీడియో వైరల్: అద్దాలు పెట్టుకో గానే ఆశ్చర్యపోయిన వ్యక్తి.. ఎందుకంటే..?!

అంగవైకల్యంతో బాధపడేవారు ఎన్నో అద్భుతాలు చూడాలని, ఆస్వాదించాలి అనుకుంటారు.కానీ.

 Colour Blind Ness, Viral Latest, Viral Post, Usa Mack, Social Media, Viral Video-TeluguStop.com

వారికి అది సాధ్యపడదు.అయినా కానీ వారు విజయం సాధించాలని అనుకుంటే ఎంతటి కష్టాన్నయినా బరిస్తు ఉంటారు.

తాజాగా ఓ వ్యక్తి మొట్టమొదటిసారిగా తన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.మొదటిసారి అని ఏంటి అనుకుంటున్నారా.? అవును.అమెరికాకు చెందిన మోకిన్లీ మాక్ చిన్న తనం నుంచే కలర్ బ్లైండ్ తో బాధపడుతున్నాడు .

ఈ తరుణంలో మోకిన్లీ మాక్ ఫ్రెండ్స్ అతడికి తాజాగా కలర్‌ బ్లైండ్‌ గ్లాసెస్‌ ను గిఫ్ట్ గా ఇచ్చారు.దీనితో వెంటనే అతను ఆ కళ్ళద్దాలు పెట్టుకుని ఒక్క సారిగా రంగుల ప్రపంచాన్ని చూసే సరికి మాక్ షాక్ కు గురయ్యాడు.

అలాగే తన చుట్టుపక్కల ఉన్న రంగురంగుల కార్లను, పచ్చని చెట్లను చూసి ఆనందంలో మునిగిపోయాడు.దీంతో తన చుట్టూ ఇంత అందమైన ప్రపంచం ఉందా అంటూ ఆనందంలో మునిగి పోయాడు.

ఈ సంఘటన మొత్తం అతని స్నేహితులు వీడియో తీశారు.

ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా వారు షేర్ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.మాక్ ఇంతటి అందమైన ప్రపంచాన్ని చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలను చూసి నెటిజన్స్ భావోద్వేగానికి గురి అవుతున్నారు.మరి కొందరు నెటిజన్స్ అయితే ఇది చూసి నా గుండె బరువెక్కి పోయింది.

ప్రపంచాన్ని వివిధ కోణాల్లో చూసేవారికి మీరు ఆదర్శంగా నిలుస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అలాగే మాక్ నీకు నిజమైన అద్భుతమైన స్నేహితులు ఉన్నారు.వాళ్ళని నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు.ఎప్పుడూ నీతో పాటే ఉంచుకో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube